Republic Day 2024: 'నారీశక్తి' పేరుతో మహిళా శక్తిని చాటుతున్న గణతంత్ర వేడుకలు

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. 10.30 AM కి ప్రారంభమైన ఈ వేడకలల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా శక్తిని చాటింది. ఈసారి పాల్గొననున్న త్రివిధ దళాల్లో అందరూ మహిళలే ఉండటం విశేషం. ‘నారీ శక్తి’ పేరుతో విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు.

Republic Day 2024: 'నారీశక్తి' పేరుతో మహిళా శక్తిని చాటుతున్న గణతంత్ర వేడుకలు
New Update

Nari Shakti: గణతంత్ర దినోత్సవం వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో 10.30కి ప్రారంభమైన గణంతత్ర వేడకలల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా శక్తిని చాటింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ (French President Emmanuel Macron) ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్తవ్యపథ్‌లో (Kartavya Path) 90 నిమిషాల పాటు జరిగే ఈ కార్యక్రమంలో సైనిక శక్తితో పాటు పలు సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేస్తున్నాయి. అయితే ప్రతి ఏడాది లాగే ఈసారి గణతంత్ర దినోత్సవానికి థీమ్‌గా జాతీయ మహిళా శక్తితో (Women Power) పాటు ప్రజాస్వామిక విలువల ఆధారంగా రూపొందించారు.

అందరూ మహిళలే

ఇక సైనిక ప్రదర్శనలో మన దేశంలోనే తయారుచేసిన ఆయుధాలతో సహా.. క్షిపణలు, డ్రోన్‌ జామర్లు, నిఘా వ్యవస్థలు, బీఎంపీ-2 సాయుధ శకటాలు ఉండనున్నాయి. అయితే ఈసారి పాల్గొననున్న త్రివిధ దళాల్లో అందరూ మహిళలే (Women) ఉన్నారు. చరిత్రలో మొదటిసారిగా దీప్తి రాణా, ప్రియాంకా సేవ్‌దా అనే మహిళా అధికారులు ఆయుధ లొకేషన్‌ గుర్తింపు రాడార్‌, పినాక రాకెట్‌ వ్యవస్థలకు పరేడ్‌లో నేతృత్వం వహించడం విశేషం. పరేడ్‌లో 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపిస్తారు. మరోవైపు 15 మంది మహిళా పైలట్లు వాయు సేన విన్యాసాలను ప్రదర్శించనున్నారు.

Also Read: పాకిస్తానీలను చంపింది భారత ఏజంట్లే..భారత్‌ పై పాక్‌ సంచలన ఆరోపణలు!

నారీ శక్తి

జాతీయ వార్ మెమోరియల్‌ను ప్రధాని మోదీ (PM Modi) సందర్శించిన అనంతరం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పరేడ్‌తో పాటు వివిధ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి 90 మంది సభ్యుల ఫ్రాన్స్‌ దళం కూడా పాల్గొంది. 260 మంది సీఆర్‌పీఎఫ్‌ (CRPF), బీఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ మహిళా సైనికులు ‘నారీ శక్తి’ (Nari Shakti) పేరుతో విన్యాసాలను ప్రదర్శించనున్నారు. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు పరేడ్‌లో పాల్గొంటాయి. అయితే ఈసారి తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్‌ (AP) శకటాలు కూడా ఉన్నాయి. అలాగే వీటితో పాటు సామాజిక-ఆర్థిక కార్యకలాపలతో సహా సాంకేతిక రంగాన్ని ప్రతిబింబించేలా మహిళలకు చెందిన 10 శకటాలున్నాయి.

తొలిసారిగా మహిళా నేతృత్వంలో

ఇదిలా ఉండగా.. దేశంలోని దాదాపు 500 మంది గ్రామ పంచాయతీల ప్రజా ప్రతినిధులు కూడా ఈ రిపబ్లిడ్ డే వేడుకలకు హాజరయ్యారు. వీళ్లందరూ కూడా గతేడాది జాతీయ అవార్డులు గెలుచుకున్నవారే. 300 ఏళ్ల బాంబే శాపర్స్‌ రెజిమెంట్‌ చరిత్రలో అందరూ పురుషులే ఉన్న బృందానికి తొలిసారిగా ఓ మహిళా నేతృత్వం వహించనున్నారు. 31 ఏళ్ల మేజర్‌ దివ్య త్యాగికి ఛాన్స్ దక్కింది. అయితే దట్టమైన పొగ మంచు కారణంగా రిపబ్లిక్‌ డే వేడుకల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నవారిలో దూరం నుంచి చూసేవారికి స్పష్టంగా కనిపించకపోవచ్చని భారత వాతావరణశాఖ పేర్కొంది. ఉదయం 8.30 సమయానికి 400 మీటర్ల దూరమే కనిపించనుందని, 10.30కు 1,500 మీటర్ల వరకూ కనిపించే అవకాశాలున్నట్లు పేర్కొంది. మరో విషయం ఏంటంటే రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా 70,000 మందితో ఢిల్లీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇందులో 14,000 మందిని కర్తవ్యపథ్‌లో మోహరించారు.

Also Read: ఆ గ్రామాల్లో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

#telugu-news #pm-modi #national-news #president-droupadi-murmu #nari-shakti #republic-day-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe