/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/PM-Modi-2-jpg.webp)
Rahul Gandhi : ప్రధాని మోదీ(PM Modi) పై కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ సంచనల వ్యాఖ్యలు చేశారు. మోదీ.. తన బిలియనీర్ మిత్రుల కోసం ఏకంగా రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని ఆరోపించారు. ఇలాంటి నేరానికి పాల్పడిన ప్రధాని మోదీని దేశం ఎన్నటికీ క్షమించదని విమర్శించారు. ఈరోజు రాహుల్ తన ఎక్స్(X) ఖాతాలో ఈ విషయాన్ని పోస్టు చేశారు. 16 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని భారతీయుల(Indians) బాధతలను తీర్చేందుకు వాడేవాళ్లమని రాహుల్ అన్నారు. అదానీ లాంటి వాళ్లు ఆ డబ్బును ఖర్చును చేసినట్లు ఆరోపణలు చేశారు.
Also Read: సంపద పునఃపంపిణీ మీద శామ్ పిట్రోడా ఆసక్తికర వ్యాఖ్యలు
అలాగే ఇంత మొత్తం డబ్బుతో 16 కోట్ల యువతకు ఉద్యోగం కల్పించేవాళ్లమని రాహుల్ అన్నారు. ప్రతి ఏడాది 16 కోట్ల మంది ఉద్యోగులకు లక్ష ఇచ్చేవాళ్లమని తెలిపారు. 16 కోట్ల మంది మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తే వాళ్ల జీవితాలు మారిపోయి ఉండేవన్నారు. 10 కోట్ల మంది రైతుల రుణాలు రద్దు చేస్తే.. ఎంతోమంది రైతుల ఆత్మహత్యలు ఆపేవాళ్లమని తెలిపారు. 20 ఏళ్లపాటు రూ.400లకే గ్యాస్ సిలిండర్లను దేశ ప్రజలకు అందించేవాళ్లమన్నారు. భారతీయ ఆర్మీకి మూడేళ్ల ఖర్చును ఆ డబ్బులతో తీర్చేవాళ్లమన్నారు. ఆ డబ్బుతో దళిత, గిరిజన,వెనుకబడిన తరగతుల ప్రజలకు గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యను అందించవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం రాహుల్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
नरेंद्र मोदी ने अपने अरबपति मित्रों का 1,60,00,00,00,00,000 मतलब 16 लाख करोड़ रुपया कर्ज़ा माफ किया है!
इतने पैसों से:
- 16 करोड़ युवाओं को 1 लाख रू साल की नौकरी मिल सकती थी
- 16 करोड़ महिलाओं को 1 लाख रू साल देकर उनके परिवारों की जिंदगी बदली जा सकती थी
- 10 करोड़ किसान…
— Rahul Gandhi (@RahulGandhi) April 24, 2024
Also read: విశ్వబంధు.. మోడీ గ్యారెంటీపై జయశంకర్ కీలక వ్యాఖ్యలు!