PM Modi: పుతిన్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే ?

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు తాజాగా ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఇటీవల ఉక్రెయిన్‌ పర్యటనకు వెళ్లడంతో దానికి సంబంధించిన వివరాలతో పాటు యుద్ధ సంక్షోభానికి ముగింపు పలికే విషయాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.

New Update

ప్రధాని మోదీ ఇటీవల ఉక్రెయిన్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. చర్చలు, సంప్రదింపులతో వివాదాన్ని పరిష్కరించుకోవాని ఆయన అధ్యక్షుడు జెలెన్‌స్కీకి సూచించారు. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని ఫోన్ చేశారు. ఉక్రెయిన్‌ పర్యటనకు సంబంధించిన పలు వివరాలతో పాటు యుద్ధ సంక్షోభానికి ముగింపు పలికే విషయాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా దీనిపై ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Also Read: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత.. త్వరలో మూడో ప్రపంచ యుద్ధం !

' ఇరు దేశాల మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపాం. రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న వివాదంపై మా అభిప్రాయాలు షేర్ చేసుకున్నాం. శాంతియుతంగా సంక్షోభానికి ముగింపు పలికేలా, అక్కడ శాంతి-స్థిరత్వం కోసం భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని'ప్రధాని మోదీ ఎక్స్‌లో తెలిపారు.

మరోవైపు ఉక్రెయిన్‌లో ఇటీవల మోదీ పర్యటించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హర్షం వ్యక్తం చేశారు. తన పర్యటన ద్వారా మోదీ శాంతి సందేశం పంపారంటూ ప్రశంసించారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న మానవతా సాయానికి మద్దుతుగా నిలిచారని బైడెన్ అన్నారు. ఇదిలాఉండగా ఉక్రెయిన్-రష్యా మధ్య మళ్లీ పరిస్థితులు ముదురుతున్నాయి. ఉక్రెయిన్ మీద మళ్ళీ రష్యా దాడులు ప్రారంభించింది.ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా చాలా చోట్ల క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడింది. దీంతో అక్కడ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. రష్యా దాడులను అరిట్టేందుకు సాయం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూరోపియన్ దేశాలను కోరారు.

Also Read: తమిళనాడు మత్స్యకారులను అరెస్ట్‌ చేసిన శ్రీలంక నేవీ!

#russia #putin #pm-modi #russia-ukraine
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe