Nara Lokesh : రెండో రోజు సీఐడీ విచారణకు నారా లోకేష్...ఏం జరగబోతోంది..??

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను రెండో రోజు సీఐడి విచారించనుంది. నేడు మరోసారి సీఐడీ విచారణకు రావాల్సిందిగా లోకేశ్ ను ఆదేశించింది. కాగా మంగళవారం దాదాపు 6గంటల పాటు లోకేశ్ ను సీఐడీ ప్రశ్నించింది. ఆయన్ను 30 ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం. విచారణకు లోకేశ్ ఏమాత్రం సహరించలేదని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి సీఐడి విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలోనే నేడు సీఐడీ ముందు విచారణకు లోకేశ్ హాజరుకానున్నారు.

New Update
Breaking: లోకేష్ కు బిగ్ షాక్..ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్.!

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను రెండో రోజు సీఐడి విచారించనుంది. నేడు మరోసారి సీఐడీ విచారణకు రావాల్సిందిగా లోకేశ్ ను ఆదేశించింది. కాగా మంగళవారం దాదాపు 6గంటల పాటు లోకేశ్ ను సీఐడీ ప్రశ్నించింది. ఆయన్ను 30 ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం. విచారణకు లోకేశ్ ఏమాత్రం సహరించలేదని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి సీఐడి విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలోనే నేడు సీఐడీ ముందు విచారణకు లోకేశ్ హాజరుకానున్నారు.

ఇది కూడా చదవండి: ఆయుధాలతో ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా ఫ్లైట్ ..!!

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నేడు రెండో రోజు సీఐడీ విచారణకు నారా లోకేశ్ హాజరుకానున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో నిన్న లోకేశ్ విచారణకు హాజరయ్యారు. నిన్న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకూ విచారణ కొనసాగింది. కాగా సీఐడీ అధికారులు లోకేష్ ను 30 ప్రశ్నలు వేసినట్లు సమాచారం. హెరిటేజ్ లో డైరెక్టర్ గా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలపై కూడా లోకేష్ ను ప్రశ్నించింది సీఐడీ. ఇవాళ ఉదయం 10 గంటలకు హాజరుకావాలని లోకేశ్ కు మరోసారి నోటీస్ ఇచ్చారు సీఐడీ అధికారులు. కాగా IRR అలైన్మెంట్ మార్పు కేసులో లోకేష్ తో పాటు సీఐడీ విచారణకు మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కూడా హాజరుకానున్నారు. లోకేష్,పునీత్ లను వేరువేరుగా సీఐడీ విచారించనుంది.

కాగా మొదటిరోజు విచారణలో తనను మొత్తం 50 ప్రశ్నలు అడిగారని లోకేష్ చెప్పారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో తాను కానీ, తన కుటుంబం కానీ ఎలా లబ్ధి పొందుతాం అని ప్రశ్నించారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రస్థావనే తన దగ్గరకు రాలేదన్నారు. ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకే సీఐడీ కాలయాపన చేస్తోదని ఆరోపించారు. ఇంకా ప్రశ్నలున్నాయి.. మీరు రేపు మరోసారి రండి అని దర్యాప్తు అధికారులు కోరారన్నారు.

నేను ఎంత టైమ్ అయినా పర్వాలేదు.. ఈరోజే ప్రశ్నలు అడగండని కోరానన్నారు. కేవలం కాలయాపన చేయడానికే విచారణ మరో రోజు పొడిగించారన్నారు. బుధవారం మళ్లీ విచారణకు హాజరై.. విచారణకు సహకరిస్తాన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మీరు ఏఏ పదవులు చేశారు? హెరిటేజ్ లో మీరు ఎలాంటి పదవుల్లో ఉన్నారు? అంటూ గూగుల్ లో ఉన్న సమాచారాన్నే ప్రశ్నలుగా తిప్పి తిప్పి అడిగారని అన్నారు. అన్నీ జనరల్ క్వశ్చన్స్ నే అడిగారన్నారు. తన పేరు గూగుల్ లో కొట్టినా ఆ సమాచారం తెలుస్తుందన్నారు. అడిగిన ప్రతీ ప్రశ్నకు తాను సమాధానం చెప్పానన్నారు.

ఇది కూడా చదవండి: ఎన్టీపీసీలో కొలువుల జాతర..495 పోస్టులకు రిక్రూట్ మెంట్..!!

మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయన విచారణ ప్రారంభం కాగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. దీంతో 6 గంటల పాటు లోకేష్ పై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు, ప్రతిపాదిత రింగ్ రోడ్ సమీపంలో హెరిటేజ్ భూములు కొనుగోలు, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి లో పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు పై సీఐడీ లోకేషన్ ను ప్రశ్నించినట్లు సమాచారం. దాదాపు అనేక ప్రశ్నలకు.. నాకు తెలియదు అని లోకేష్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు విషయంలో తన ప్రమేయం లేదని ఆయన చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. మంగళవారం జరిగిన విచారణకు నారా లోకేష్ సహకరించలేదని సీఐడీ వర్గాలు వెల్లడించాయి.

Advertisment
తాజా కథనాలు