Nara Lokesh: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కోరిన నారా లోకేశ్

చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీ లో ఉన్నారు. అమిత్ షా తో పాటూ కేంద్రమంత్రులను కలిసి తన తండ్రి అరెస్ట్ గురించి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగానే లోకేశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్ మెంట్ ను కూడా కోరినట్లు సమాచారం.

New Update
Breaking: లోకేష్ కు బిగ్ షాక్..ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్.!

Nara Lokesh: నారా లోకేష్ ఈరోజు ఉదయం ఢిల్లీ వెళ్ళారు. అక్కడ హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ను కలవడానికి ఆయన ట్రై చేస్తున్నారు. అమిత్ షా తో పాటూ పలువురు కేంద్ర మంత్రులనూ కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా లోకేశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. చంద్రబాబును ఏపీ సీఐడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని లోకేశ్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారని సమాచారం. అంతేకాక ఈ కేసులో రాష్ట్రపతి జోక్యం కూడా కలుగజేసుకోవాలని లోకేశ్ కోరనున్నరని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

రాజండ్రిలో నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, బాలకృష్ణ, నారా లోకేశ్ లు చంద్రబాబును జైలు దగ్గర కలిశారు. బాబును కలిశాక ప్రెస్ మీట్ లో పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో లోకేశ్ ఢిల్లీ వెళ్ళడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అతను కేవలం తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని వివరించడానికి వెళ్ళాడా లేదా ఇంకేమైనా విషయాల గురించి చర్చిస్తారా అనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది. జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటోంది కాబట్టి బీజెపీతో కూడా కలిసే అవకాశం ఉందా...దాని విషయమే లోకేశ్ అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులతో మాట్లాడతారేమో అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Also Read: హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులకు పోలీసుల షాక్

Advertisment
తాజా కథనాలు