Kanthi tho Kranthi Program: కాంతితో క్రాంతి అంటున్న లోకేష్‌..చంద్రబాబుకి మద్దుతుగా ఈ పని చేయండి!

ప్రగతి వెలుగులు పంచే చంద్రుడుని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో నిర్బంధించారు. 7వ తేదీ శనివారం రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకూ ఇళ్లలో లైట్లు ఆపి..దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించి..వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా దార్శనికుడు చంద్రబాబు గారికి సంఘీభావం తెలపండి''. అంటూ ఆయన ట్విటర్‌ (ఎక్స్‌) లో వివరించారు.

Kanthi tho Kranthi Program: కాంతితో క్రాంతి అంటున్న లోకేష్‌..చంద్రబాబుకి మద్దుతుగా ఈ పని చేయండి!
New Update

TDP Calls for Kanthi tho Kranthi program: నారా చంద్రబాబు నాయుడిని(Chandrababu Naidu)  స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో పోలీసులు కస్టడీకి(Custody) తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన గత 28 రోజులుగా రాజమండ్రి సెంట్రల్‌ జైలులోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనను మొదట 14 రోజులు రిమాండ్‌ కు తీసుకోగా..తరువాత మరి కొన్ని రోజులు రిమాండ్‌ పొడిగించడం అయ్యింది.

దాంతో ఆయన ఈనెల 19 వరకు కూడా జైలులోనే ఉండాల్సి ఉంటుందని తెలుస్తుంది. చంద్రబాబును అరెస్ట్‌ చేసినప్పటి నుంచి కూడా లోకేష్‌ ఆయన కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన రెండు రోజుల క్రితమే ఢిల్లీ నుంచి రాజమండ్రికి చేరుకున్నారు.

చంద్రబాబు అరెస్ట్‌ ని నిరసిస్తూ ఆయన భార్య భువనేశ్వరి (Bhuvaneswari) , కోడలు నారా బ్రహ్మాణి (Brahmani) ఇద్దరు కూడా తమ మద్దతును తెలుపుతూ రాజమండ్రిలోనే ఉంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు అరెస్ట్‌ ని నిరసిస్తూ ఆయనకు ప్రజలందరూ కూడా మద్దతివ్వాలని కోరారు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబుకి మద్దుతుగా మోత మోగిద్దాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుగా..ఇప్పుడు తాజాగా నారా లోకేష్‌ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Also Read: వైకుంఠ ఏకాదశికి ఏడు లక్షల టిక్కెట్లు..టీటీడీ ఈవో!

ఈ సందర్భంగా ఆ కార్యక్రమం గురించి ఆయన తన ట్విటర్‌ ఖాతా ద్వారా అభిమానులు, టీడీపీ కార్యకర్తలతో పంచుకున్నారు. ప్రగతి వెలుగులు పంచే చంద్రుడుని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో నిర్బంధించారు. 7వ తేదీ శనివారం రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకూ ఇళ్లలో లైట్లు ఆపి..దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించి..వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా దార్శనికుడు చంద్రబాబు (Chandrababu) గారికి సంఘీభావం తెలపండి''. అంటూ ఆయన ట్విటర్‌ (ఎక్స్‌) లో వివరించారు.

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసు (AP Skill Development case) చంద్రబాబు కుటుంబాన్ని ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడంలేదు. ముందుస్తు బెయిల్ పిటిషన్‌ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 12కు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

గతంలో ఏం జరిగింది?

స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో టీడీపీ నేత నారా లోకేశ్‌ను అక్టోబర్ 4(ఇవాళ్టి) వరకు అరెస్టు చేయకుండా సీఐడీ పోలీసులపై హైకోర్టు నాలుగు రోజుల క్రితం స్టే విధించింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా లోకేశ్ ను ఇంకా ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదని సీఐడీ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో తాను నిందితుడిని కాదని లోకేశ్ స్వయంగా చెప్పినందున ముందస్తు బెయిల్ పిటిషన్ లో వాస్తవం లేదని సీఐడీ పేర్కొంది.

అటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) కేసులో లోకేశ్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేస్తామని సీఐడీ హైకోర్టుకు తెలిపింది. ఐఆర్ఆర్ అలైన్మెంట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ లోకేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. తన తండ్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై నమోదైన కేసులకు సంబంధించి లోకేశ్‌ ఢిల్లీలో మకాం వేసి న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఇక రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశారని, సీఆర్పీసీ సెక్షన్ 439 కింద దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఐఆర్ఆర్ కేసు కుట్రతో కూడిన ‘లోతైన’ ఆర్థిక నేరమని సీఐడీ అభిప్రాయపడింది. ట్రయల్ కోర్టులో విచారణను ముందుగానే వాయిదా వేసేందుకు చంద్రబాబు నాయుడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని తెలిపింది.

#nara-lokesh #tdp #ap #skill-development-case #cbn #chandrababu-naidu-arrest #kanthi-tho-kranthi-program
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe