AP: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నందిగం సురేష్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్ట్ చేశారు. By Bhavana 05 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Nandigam Suresh Arrested: వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నందిగం సురేష్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టుకొట్టేసింది. దీంతో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు బుధవారం ఉద్దండరాయునిపాలెంలోని తుళ్లూరు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే సురేష్ అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. తన సెల్ కూడా స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో పోలీసులు చాలా సేపు అక్కడే ఉండి వెనుదిరిగారు. సెల్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నిస్తున్నారనే పక్కా సమాచారంతో హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బలగాలు ఆయన్ని అరెస్ట్ చేసి మంగళగిరి తరలిస్తున్నట్లు తెలిపారు. అయితే నందిగం సురేష్ అరెస్ట్ గురించి పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలంతా కూడా అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. Also Read: తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు! #ap-news #ycp #tdp #arrest #baptla #nandhigam-suresh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి