పాలు తాగుతున్న నంది విగ్రహం.. ఆశ్చర్యానికి లోనైన భక్తులు

పాలు తాగుతున్న నంది విగ్రహం.. ఆశ్చర్యానికి లోనైన భక్తులు
New Update

నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న మహదేవుని ఆలయంలోని నందీశ్వరుని విగ్రహం పాలు తాగుతుండటంతో భక్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ విషయం తెలియడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.

అందరూ నందీశ్వరునికి స్వయంగా స్పూన్ లతో పాలు, నీళ్లు, కొబ్బరి నీళ్లు పట్టిస్తున్నారు. నందీశ్వరుడు వీటిని తాగుతుండటంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త వైరల్ గా మారింది.

ఈ వింతను చూసేందుకు కమ్మరపల్లి మండలంలోని ఇతర గ్రామాల ప్రజలు క్యూ కట్టారు. అయితే మొదట ఈ వింతను నమ్మడం లేదు.. ఆతర్వాత స్వయంగా వారే వచ్చి పాలు పట్టించడంతో ఆశ్చర్యానికి లోనవుతున్నారు. తమ గ్రామంలో నందీశ్వరుడు పాలు, నీళ్లు తాగడం పరమశివుడి లీల అని కొందరు భక్తులు అంటున్నారు.

అయితే ఈ విషయంపై శాస్త్రవేత్తలు ఏం అంటున్నారంటే.. నందీశ్వర విగ్రహం పాలు తాగడం వెనుక అసలు రహస్యం వేరే ఉందని చెబుతున్నారు. విగ్రహాలు పాలు తాగడం వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయంటున్నారు. కొన్ని రాతి విగ్రహాలు, ఇసుక రాయి లేదా మట్టితో తయారైన దేవుడి విగ్రహాలు కొంతైనా నీటిని పీల్చుకునే గుణం ఉంటుందని చెబుతున్నారు. సర్ఫేస్ టెన్షన్ అనే ప్రక్రియ వల్ల అలా జరుగుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.

#telangana-news #telangana #latest-news #nizamabad-district #nizamabad #drinking-milk #nandi-idol #nandi-idol-drinking-milk
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe