Milk : పాలు తాగే విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే డేంజర్ లో పడినట్టే...
పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ పాలు తాగడం కూడా కొంతమందికి హానికరం అని మీకు తెలుసా? పాలు ఎవరు తాగకూడదో తెలుసుకుందాం.
పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ పాలు తాగడం కూడా కొంతమందికి హానికరం అని మీకు తెలుసా? పాలు ఎవరు తాగకూడదో తెలుసుకుందాం.
పాలు ఎక్కువగా తాగితే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు అంటున్నారు. ఎక్కువగా పాలు తాగితే జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు, కడుపులో తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల బరువు అధికంగా పెరుగుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పాలు తాగి అలా బెడ్ ఎక్కి నిద్రపోయే అలవాటు చాలామందికి ఉంది. అయితే ఇది కరెక్ట్ కాదని నేషనల్ స్లీప్ ఫౌండేషన్ చెబుతోంది. ఇలా నిద్రపోయే ముందు పాలు తాగడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు పెరగడం, అజీర్ణం లాంటి సమస్యలు వస్తాయి. అందుకే నిద్రకు కనీసం రెండు గంటల ముందు పాలు తాగాలి.