Nandamuri Balakrishna Birthday Special Story : నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ,రాజకీయ రంగాల్లో తన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. కేవలం 14 ఏళ్లకే ఎన్టీఆర్ (NTR) నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసి.. నాలుగు దశాబ్దాలకుపైగా ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న బాలయ్య నేడు తన 64 వ పుట్టిన రోజు (Birthday) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ లో ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
14 ఏళ్లకే సినీరంగ ప్రవేశం
తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన 'తాతమ్మ కల' మూవీ ద్వారా బాలకృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్‌గా 14 ఏళ్లకే సినీ కెరీర్ ప్రారంభించారు. ఆ తరువాత స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో 1984లో 'మంగమ్మ గారి మనవడు' సినిమాతో హీరోగా తొలి బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ఆ తరువాత బాలయ్య మళ్లీ వెనుతిరిగి చూసుకోలేదు. తండ్రి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుని.. తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు.
Also Read : బాలయ్య బర్త్ డే ట్రీట్.. ‘NBK 109’ నుంచి ఫైరింగ్ అప్డేట్, ఏంటో తెలుసా?
ఇన్నేళ్ళ సినీ కెరీర్ లో బాలయ్య అన్ని జోనర్స్ టచ్ చేశాడు.1991లో సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్‌లో వచ్చిన తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య 369. అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ తరువాత బాలయ్య నటించిన 'భైరవద్వీపం' మూవీ మరోస్థాయికి తీసుకెళ్లింది. బాలకృష్ణ బిగ్గెస్ట్ హిట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. పెద్దన్నయ్య, పవిత్రప్రేమ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించారు.
ఫ్యాక్షన్ సినిమాలకు నాంది
బాలకృష్ణ కెరీర్‌ను భారీ మలుపు తిప్పిన సినిమా 'సమరసింహా రెడ్డి'. ఫ్యాక్షన్ సినిమాలకు నాంది పలుకుతూ.. బి.గోపాల్ డైరెక్షన్‌లో 1999లో వచ్చిన ఆ మూవీ టాలీవుడ్‌లో అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. బాలయ్యబాబుకు ఒక్కసారిగా మాస్ ఫాలోయింగ్‌ను తీసుకువచ్చింది. ఆ తర్వాత నరసింహ నాయుడు, చెన్నకేశవ రెడ్డి, సీమ సింహం, లక్ష్మీ నరసింహ వంటి హిట్స్ అందుకున్నాడు.
ఈ సినిమాల తర్వాత బాలయ్యకువరుస పరాజయాలు పలకరించాయి. మళ్లీ బోయపాటి దర్శకత్వంలో 2010 లో వచ్చిన 'సింహా ' తో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన లెజెండ్, అఖండ సినిమాలు బాలయ్య మార్కెట్ పెంచాయి. ఇక గత ఏడాది వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని 'NBK109' తో హ్యాట్రిక్ పై కన్నేశాడు.
కెరీర్ లో 100 కుపైగా సినిమాలు చేసిన బాలయ్య ఇండస్ట్రీలో క్రియేట్ చేసిన పలు రికార్డులు...
1. బాలయ్య ఇప్పటి వరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చేయలేదు. అలాగే తండ్రి సీనియర్ ఎన్టీఆర్‌తో కలిసి 10కిపైగా సినిమాల్లో కనిపించారు.
2. ఇప్పుడున్న నటుల్లో పౌరాణిక, సాంఘికం, జానపదం, సైన్స్‌ఫిక్షన్ ఇన్ని జానర్లను టచ్ చేసిన ఏకైక హీరో బాలకృష్ణ మాత్రమే.
3. 1987లో బాలకృష్ణ హీరోగా నటించిన 8 సినిమాలు విడుదలయ్యాయి. అవన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి.
4. టాలీవుడ్ (Tollywood) లో అత్యధిక సినిమాల్లో డ్యుయల్ రోల్లో నటించిన రికార్డు బాలయ్య పేరిటే ఉంది. ఆయన కెరీర్లో ఇప్పటిదాకా 17 సినిమాల్లో ద్విపాత్రాభినయం పాత్ర పోషించారు.
5. సింగర్ గానూ ఫ్యాన్స్‌ను అలరించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'పైసా వసూల్' సినిమాలో 'మామా ఏక్ పెగ్ లా' పాటను పాడి అభిమానులను ఉర్రూతలూగించారు.
6. 'అన్‌స్టాపబుల్' షోతో తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. ఈ షో తో హోస్ట్‌గానూ సూపర్ హిట్ అయ్యారు.
7. సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లోనూ అదరగొట్టేస్తున్నారు. ప్రజాసేవ చేస్తూ పాలిటిక్స్‌లో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.