Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులైన భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుకు (Praneeth Rao) నాంపల్లి కోర్టు షాకిచ్చింది. వాళ్లపై నమోదైన ఛార్జిషీట్‌ను న్యాయస్థానం అంగీకరించింది. అలాగే ఈ ముగ్గురు నిందితులతో పాటు మరో నిందితుడు రాధా కిషన్ రావు (Radha Kishan Rao) దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్‌ను కూడా తిరస్కరించింది. సరైన సమయంలో తమపై ఛార్జీషీటు దాఖలు కానందున తమకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని నిందితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ప్రొసెక్యూషన్, డిఫెన్స్ న్యాయాదుల వాదనలు విన్న కోర్టు చివరికి బెయిల్‌ను తిరస్కరించింది.
Also Read: ఎన్డీయేకు షాక్.. 10 చోట్ల ఇండియా కూటమి విజయం
ఇంతకు మందు నాంపల్లి కోర్టు ఛార్జిషీటును పరిగణలోకి తీసుకునేందుకు మూడుసార్లు తిరస్కరించింది. మొదటి రెండు సందర్భాల్లో టైపింగ్ ఎర్రర్స్ ఉన్నాయని, మూడోసారి ఈ కేసు ఇంకా పరిశీలనలో ఉందనే కారణంతో నిరాకరించింది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఈ కేసుకు సంబంధించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే అనుమతి రావడంతో.. హైదరాబాద్ పోలీసులు మరోసారి నాంపల్లి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. దీంతో ఈసారి న్యాయస్థానం కూడా ఛార్జిషీటును పరిగణలోకి తీసుకునేందుకు అంగీకరించింది. దీంతో నిందితుల బెయిల్ కూడా తిరస్కరించింది.
అయితే ఇప్పుడు కోర్టు ఛార్జీషీటును అంగీకరించిన నేపథ్యంలో.. విచారణ అధికారులు పరారీలో ఉన్న నిందితులు ప్రభాకర్ రావు, శ్రావణ్ కుమార్‌లపై బ్లూ కార్నర్ లేదా రెడ్ కార్నర్ నోటీసులు పొందేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)తో విచారణను కొనసాగిస్తారు. అయితే ప్రస్తుతం ఈ నిందితులు అమెరికాలో ఉన్నారు. సీబీఐ ద్వారా ఇంటర్‌పోల్‌ను చేరుకునేందుకు నిందితులపై ఛార్జిషీటును దాఖలు చేయడం తప్పనిసరి అని ఓ సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు.
Also Read: ఇది ఆరంభం మాత్రమే.. ఇంకా చూపిస్తాం: ఐదు యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించిన ‘మా’!