Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులైన భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుకు (Praneeth Rao) నాంపల్లి కోర్టు షాకిచ్చింది. వాళ్లపై నమోదైన ఛార్జిషీట్‌ను న్యాయస్థానం అంగీకరించింది. అలాగే ఈ ముగ్గురు నిందితులతో పాటు మరో నిందితుడు రాధా కిషన్ రావు (Radha Kishan Rao) దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్‌ను కూడా తిరస్కరించింది. సరైన సమయంలో తమపై ఛార్జీషీటు దాఖలు కానందున తమకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని నిందితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ప్రొసెక్యూషన్, డిఫెన్స్ న్యాయాదుల వాదనలు విన్న కోర్టు చివరికి బెయిల్‌ను తిరస్కరించింది.
పూర్తిగా చదవండి..Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు షాక్.. బెయిల్ తిరస్కరించిన కోర్టు
ఫోన్‌ట్యాపింగ్ కేసులో నిందితులైన భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. వాళ్లపై నమోదైన ఛార్జిషీట్‌ను న్యాయస్థానం అంగీకరించింది. ఈ ముగ్గురు నిందితులతో పాటు మరో నిందితుడు రాధా కిషన్ రావు దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్‌ను కూడా తిరస్కరించింది.
Translate this News: