Naa Saami Ranga First Look Teaser: నాగార్జున (Nagarjuna) పుట్టినరోజు సందర్భాగా అతడి కొత్త సినిమా డీటెయిల్స్ బయటకొచ్చాయి. తన తదుపరి ప్రాజెక్ట్ కోసం కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నితో కలిసి పని చేయనున్నాడు నాగ్. దర్శకుడిగా విజయ్‌కు ఇదే తొలి సినిమా. శ్రీనివాస చిట్టూరి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.
ఆస్కార్ అవార్డుతో పాటు, జాతీయ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి (MM Keeravani) ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు. ఈ సినిమాకు నా సామి రంగా (Naa Saami Ranga) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బర్త్ డే సందర్భంగా టైటిల్‌తో పాటు, గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.
నాగార్జున చాలా కాలం తర్వాత రఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. అతడి గడ్డం, హెయిర్ స్టయిల్‌తో పాటు.. టోటల్ మేకోవర్ బాగుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గాయాలతో బీడీ తాగుతూ కనిపించాడు నాగ్. గ్లింప్స్‌లో కంప్లీట్‌గా మాస్ ఎలిమెంట్స్ చూపించారు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది.
గ్లింప్స్ కోసం అనుకున్న కాన్సెప్ట్ రిచ్‌గా, ఎట్రాక్టివ్‌గా ఉంది. గ్లింప్స్‌తో పలాస్ ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్‌ను వాడుకున్నారు. అతడు గ్లింప్స్‌లోనే కనిపిస్తాడా లేక సినిమాలో కూడా ఉంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. గ్లింప్స్ లో ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. ఇక కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జాతర అంటూ కీరవాణి అందించిన బీజీఎం గ్లింప్స్‌కు మంచి ఫీల్ తీసుకొచ్చింది.
ఈ సినిమాకు బెజవాడ ప్రసన్నకుమార్ కథ-మాటలు రాశాడు. నిజానికి ఈ సినిమాను బెజవాడ ప్రసన్నకుమార్ డైరక్ట్ చేస్తాడని అంతా అనుకున్నారు. అనధికారికంగా ప్రసన్న కూడా ఈ విషయాన్ని నిర్థారించాడు. కానీ ఆఖరి నిమిషంలో ప్రసన్నకుమార్ స్థానంలో బిన్నీ విజయ్‌ను తీసుకున్నారు. విజయ్ చెప్పిన మార్పుచేర్పులు నాగార్జునకు బాగా నచ్చాయి. దీంతో అతడికే అవకాశం ఇచ్చాడు.కెరీర్‌లో నాగార్జునకు ఇది 99వ సినిమా. అందుకే దీన్ని అతడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. అందుకే సెంటిమెంట్ కొద్దీ తన సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు నాగ్.
Also Read: ఆరుపదుల నవమన్మధుడు. టాలీవుడ్ కింగ్