/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/nagababu-2.jpg)
Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-బీజేపీ- జనసేన కూటమి భారీ విజయాన్ని సాధించి అధికార పగ్గాలు చేపట్టబోతుంది. ఇక పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భారీ విజయం నమోదు చేశారు. 70 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. దీంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు అంబరాన్నంటే సంబరాలు చేసుకుంటున్నారు.
సరికొత్త రాజకీయ మలుపుగా ఈ గెలుపు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది
ఈ గెలుపు జనం గెలుపు,జనసేనాని గెలుపు,విజనరీ చంద్రబాబుగారి గెలుపు,భరతమాత ముద్దు బిడ్డ గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ గారి గెలుపు
నాయకుడి పిలుపుతో
మార్పు కోసం పాటుపడిన ప్రతి పౌరుడి గెలుపు..
కూటమి విజయానికి పాటుపడిన… pic.twitter.com/i8oXg5W1YJ— Naga Babu Konidela (@NagaBabuOffl) June 4, 2024
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘సరికొత్త రాజకీయ మలుపుగా ఈ గెలుపు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ గెలుపు జనం గెలుపు. జనసేనాని గెలుపు. విజనరీ చంద్రబాబు గెలుపు. భరతమాత ముద్దు బిడ్డ గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గెలుపు. నాయకుడి పిలుపుతో మార్పు కోసం పాటుపడిన ప్రతి పౌరుడి గెలుపు. కూటమి విజయానికి పాటుపడిన ప్రతి కార్యకర్తకి, ప్రతి జనసైనికుడికి, వీరమహిళకి నా ధన్యవాదాలు, శుభాబినందనలు.’’ తెలుపుతున్నట్లు నాగబాబు ట్విటర్లో రాసుకొచ్చారు.