Thandel: నాగ చైతన్య 'తండేల్' షూటింగ్.. ఎక్కడో తెలుసా..?

అక్కినేని నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి కథానాయికగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం 'తండేల్'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. సినిమా షూటింగ్ కర్ణాటకలోని గోకర్ణలో డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.

New Update
Thandel: నాగ చైతన్య 'తండేల్' షూటింగ్.. ఎక్కడో తెలుసా..?

Naga Chaitanya’s Thandel: డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న మూడవ చిత్రం 'తండేల్'. అక్కినేని యువ హీరో నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ (Geetha Arts) పై అల్లు అరవింద్ సమర్పణ లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్థూడియోస్ లో ఈ సినిమా పూజ కార్యక్రమాలతో ఘనంగా మొదలైన సంగతి తెలిసిందే. ఈ పూజ కార్యక్రమానికి అల్లు అరవింద్, వెంకటేష్, నాగార్జున ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వెంకటేష్ ఈ సినిమాకు క్లాప్ కొట్టి ప్రారంభించారు.

publive-image

ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన మరో లేటెస్ట్ అప్డేట్ నెట్టింట్లో వైరల్ గా అవుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం తండేల్ షూటింగ్ కర్ణాటకలోని గోకర్ణలో డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. మత్స్య కారుల కథనంతో.. శ్రీకాకుళంలో జరిగిన ఒక యదార్థ సంఘటనలు ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో సాయి పల్లవి పక్క పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) కాంబోలో సినిమా కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ప్రేమమ్ , కార్తికేయ 2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన చందు మొండేటి నుంచి వస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు మరింత పెరిగాయి. నాగ చైతన్య కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

publive-image

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు