Pawan Kalyan : జనసేన పార్టీ ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు

జనసేన పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు దక్కాయి.జనసేన పార్టీ కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను అధికారిక విప్‌లుగా ప్రకటించాలని లేఖలో కోరారు.

New Update
Pawan Kalyan: గ్రామపంచాయతీ నిధులపై శ్వేతపత్రం: పవన్ కళ్యాణ్

Janasena : జనసేన పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు దక్కాయి. ఏపీ అసెంబ్లీ (AP Assembly) లో జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌‌గా రాష్ట్ర పార సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌‌ (Nadendla Manohar) ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయం గురించి స్పీకర్‌కి డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) సమాచారం అందించారు. పార్టీ చీఫ్‌ విప్‌‌గా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కార్యదర్శులుగా విశాఖ సౌత్‌ ఎమ్మెల్యే చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ , రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్‌ లను నియమించారు. ఈ విషయాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో ప్రకటించారు.

ఇదిలా ఉంటే జనసేన పార్టీ కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కు లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను అధికారిక విప్‌లుగా ప్రకటించాలని లేఖలో కోరారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌లను విప్‌లుగా నియమించాలని లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ నియామకాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, చీఫ్ విప్, ఇతర పదవుల్ని భర్తీ చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌గా పవన్ కళ్యాణ్ ఉన్నారు.

కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ నుంచి ఇప్పటికే ముగ్గురు చంద్రబాబు కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటే.. నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రి వర్గంలో ఉన్నారు. మిగిలిన విప్ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టారు.. అలాగే నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో కలిసి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు కసరత్తు జరుగుతోంది.

Also read: అవసరమైతే చంద్రబాబుతోనే పోరాడతాను: నారా భువనేశ్వరి!



Advertisment
Advertisment
తాజా కథనాలు