Liver Function: మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై ఎంత తాగినా మీ లివర్‌ సేఫ్‌

బ్రిటన్‌లో మద్యపాన ప్రియులు మందు తాగేటప్పుడు ఓ టాబ్లెట్‌ వేసుకుంటుండడం చర్చనీయాంశంగా మారింది. బ్రిటన్‌లో విక్రయించే ఈ మాత్ర పేరు Myrkl. ఆల్కహాల్ తాగే ముందు దీన్ని వేసుకుంటే 70 శాతం ఆల్కహాల్‌ను శరీరం నుంచి తొలగిస్తుంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Liver Function: మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై ఎంత తాగినా మీ లివర్‌ సేఫ్‌
New Update

Liver Function: మద్యం సేవించడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ శరీరం, మానసిక ఆరోగ్యాన్ని చాలా వరకు ప్రభావితం చేస్తుంది. ఆల్కహాల్ కాలేయాన్ని దెబ్బతీస్తుందని అందరికీ తెలుసు. అయినప్పటికీ ప్రజలు తమ వ్యసనాన్ని విడిచిపెట్టరు. ప్రపంచ వ్యాప్తంగా మద్యానికి బానిసైన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మద్యపానాన్ని తగ్గించడానికి బదులుగా ప్రజలు తమ ఆరోగ్యంపై మద్యపానం ప్రభావాలను తగ్గించడానికి మార్గాలను వెతుకుతున్నారు. ఇప్పుడు బ్రిటన్‌లో ఓ టాబ్లెట్‌ చర్చనీయాంశంగా మారింది. ఆ దేశంలో మద్యపాన ప్రియులు మందు తాగేటప్పుడు ఓ టాబ్లెట్‌ వేసుకుంటున్నారు. అయితే ఈ మాత్ర ఎంత మంచిదో అంతే ప్రమాదకరం అని నిపుణులు అంటున్నారు.

టాబ్లెట్‌ ఎలా పనిచేస్తుంది?

  • బ్రిటన్‌లో విక్రయించే ఈ మాత్ర పేరు Myrkl. ఆల్కహాల్ తాగే ముందు దీన్ని వేసుకుంటే ఆల్కహాల్ తాగిన 60 నిమిషాల్లోనే శరీరం నుంచి 70 శాతం ఆల్కహాల్‌ను తొలగిస్తుంది. అంతేకాకుండా ఆల్కహాల్‌ను కాలేయానికి చేరకుండా నిరోధిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వంద శాతం సహజసిద్ధమైన టాబ్లెట్‌:

  • ఈ టాబ్లెట్‌ శాఖాహారం, 100 శాతం సహజమైనదని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే ఇందులో బాసిల్లస్ కోగులన్స్, బాసిల్లస్ సబ్టిలిస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇందులో ఎల్-సిస్టీన్, విటమిన్ బి12 ఉంటాయి. ఆల్కహాల్ కాలేయంలోకి చేరకముందే పేగులలోని ఆల్కహాల్‌ను నాశనం చేసే గుణం మాత్రకు ఉంది. ఇది శరీరంలో ఎనర్జీ, ఇమ్యూనిటీ లెవెల్స్‌ను పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు.

టాబ్లెట్‌ను ఎలా టెస్ట్‌ చేశారు?

  • పరీక్షలో పాల్గొనేవారికి రెండు గ్లాసుల వైన్ ఇచ్చారు. వైన్ తాగే ముందు టాబ్లెట్‌ వేసుకోవాలని చెప్పారు. వైన్ తీసుకున్న 30 నిమిషాల తర్వాత వారిని పరీక్షించారు. ఈ సమయంలో ఆ వ్యక్తి శరీరంలో 50 శాతం ఆల్కహాల్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 60 నిమిషాల తర్వాత 70 శాతం తక్కువ మద్యం ఉన్నట్టు తేలింది. ఈ టాబ్లెట్‌ శరీరంపై ఆల్కహాల్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. మైర్క్ల్ రెండు మాత్రలు ఆల్కహాల్ తీసుకునే ఒక గంట ముందు తీసుకోవాలని, దీని ప్రభావం పన్నెండు గంటల పాటు ఉంటుందని వైద్యులు అంటున్నారు.

టాబ్లెట్‌ ఎవరు వేసుకోకూడదు?

  • స్వీడిష్ వైద్య సంస్థ ఈ టాబ్లెట్‌లపై పరిశోధన చేసింది. గత 30 ఏళ్ల పరిశోధన ఫలితంగా ఈ టాబ్లెట్‌ విడుదలైంది. అయితే గర్భిణీలు, పాలిచ్చే స్త్రీలు, 18 ఏళ్లలోపు వారు ఈ టాబ్లెట్‌ వేసుకుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఈ ఆకులు తింటే షుగర్‌ లెవల్స్‌ అస్సలు పెరగవు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #liver-function #myrkl #health-care #alcohol #best-health-tips
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe