బీఆర్ఎస్ కు మైనంపల్లి రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ నేత మైనంపల్లి హన్మంత్ ప్రకటించనున్నారు. మైనంపల్లి త్వరలోనే కాంగ్రెస్ లో జాయిన్ అవనున్నారు.

New Update
బీఆర్ఎస్ కు మైనంపల్లి రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీకి పంపించారు. కొద్ది రోజులుగా మైనంపల్లి అలకబూనారు. తన కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని కోపంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. మైనంపల్లి రెండు అసెంబ్లీ (ఎమ్మెల్యే) సీట్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఒకటే టికెట్ కేటాయించింది.

బీఆర్ఎస్ మీద కోపంగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు...తన కొడుక్కి టికెట్ రాకుండా హరీష్ రావు చేస్తున్నారని తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఇదే కోపంలో పార్టీకి ఆయన రాజీనామా చేశారు. అంతేకాదు ఢిల్లీలో 26 న సోనియా,రాహుల్ సమక్షంలో మైనంపల్లి జాయిన్ అవుతారని తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు