Breaking: ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా!
ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. లోక్ సభ ఎన్నికల ముందు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గోయల్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే ఊహగానాలు ఊపందుకున్నాయి.