Rashmika mandanna:నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది - రష్మిక మందన్నా

నేషనల్ క్రష్...ఎవరికీ లేని పేరు రష్మిక మందన్నాకు వచ్చింది. ఆమె ఏ సినిమా చేస్తే ఆ సినిమా హిట్ అనే టాక్ ఉన్న రష్మిక ఈ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టి ఏడేళ్ళు అవుతోంది. ఈ సందర్భంగా నా కల నెరేరింది అంటూ నేషనల్ క్రష్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

New Update
Rashmika mandanna:నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది - రష్మిక మందన్నా

Star heroin social media post:కిరాక్ పార్టీ నుంచి యానిమల్ వరకు రష్మిక మందన్నా ప్రయాణానికి ఈరోజుతో ఏడేళ్ళు. ఈ హీరోయిన్ చేసిన సినిమాలు అన్నీ దాదాపు హిట్. స్టార్టింగ్‌లో కొన్ని ఫ్లాపులు వచ్చినా అవేమీ ఆమె కెరీర్ మీద పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. తెలుగు, కన్నడ రెండు ఇండస్ట్రీలతో పాటూ ఇప్పుడు హిందీలో కూడా టాప్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక తన ఏడేళ్ళ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ అయింది. ఒక్క గంటలోనే 16 లక్షలమంది దీన్ని లైక్ చేశారు. ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. వాటన్నిటికీ రష్మిక రిప్లై కూడా ఇచ్చారు.

Also read:కర్ణాటక రొమాంటిక్ హైస్కూల్ ప్రిన్సిపల్ సస్పెండ్

కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూసుకుంటే అసలిదంతా ఎలా జరిగింది అనిపిస్తుంది. నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఎందుకు వచ్చానో...ఏం చేస్తున్నానో తెలియకుండా పరుగులు తీశాను. కానీ సరైన వ్యక్తులు నా చుట్టూ ఉండడం వలన ఆలోచించి అడుగులు వేయగలిగాను...అని రాసి దీనికి తన క్యూట్ ఫోటోను ఒకటి జత చేసి పోస్ట్ చేసింది నేషనల్ క్రష్ రష్మిక.

రష్మిక ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. పుష్ప తో నేషనల్ వైడ్గా పేరు సంపాదించుకున్న ఈ భామ యానిమల్‌తో బాలీవుడ్ హీరోయిన్లను దాటేసింది.సందీప్‌ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గీతాంజలి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ‘పుష్ప2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇక దీంతోపాటూ మరో రెండు సినియాలు చేస్తున్నారు. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమా రెయిన్ బోలో రష్మిక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

#Rashmika Mandanna #social-media-post #heroin
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు