Helth Tips: క్యాన్సర్‌ నుంచి కాపాడే ఆకు..అద్భుత ప్రయోజనాలు

ఆవ కూరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కూరను భూమిపై పండే ఆకుపచ్చ వజ్రం అని కూడా పిలుస్తారు. ఈ ఆవకూరలో ఆవు పాలలో ఉన్న దాని కంటే ఎక్కువగా కాల్షియం మనకు లభిస్తుంది

Helth Tips: క్యాన్సర్‌ నుంచి కాపాడే ఆకు..అద్భుత ప్రయోజనాలు
New Update

నిత్యం మనం తీసుకునే కూరగాయలు, ఆకుకూరల్లో అనేక రకాల విటమిన్లు, పోషకాలు ఉంటాయి. అయితే ఇందులో ఆకుకూరల పాత్ర అధికం. ఈ ఆకు కూరల్లో ఆవకూర గురించి తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. దీన్ని భూమిపై పండే ఆకుపచ్చ వజ్రం అని కూడా పిలుస్తారు. 100 గ్రాముల ఆవకూరలో 90 గ్రాముల వరకు నీటి శాతమే ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఎన్నో రెట్ల క్యాలరీల శక్తి కూడా ఉంటుంది. ఫ్యాట్‌-0.4 గ్రాములు, కార్బోహైడ్రేట్లు-4 గ్రాములతో పాటు ప్రోటీన్లు కూడా 3 గ్రాముల వరకు ఉంటాయి. అంతేకాకుండా వీటితో పాటు ఫైబర్ ఐదు గ్రాములు, విటమిన్-సి 70 మిల్లీ గ్రాములు. కాల్షియం-115 మిల్లీ గ్రాములు ఉంటుంది. 70శాతం విటమిన్-సి కలిగి ఉన్న ఏకైక ఆకుకూర ఇదే అని చెబుతారు. వంట చేసిన తర్వాత కూడా దీనిలో 40 శాతం విటమిన్‌-సి అలాగే ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఉల్లిపాయే కాదు..దాని పొట్టు కూడా మేలు చేస్తుంది..ఎలాగో తెలుసా..?

మామూలుగా మనకు 50 గ్రాముల వరకు విటమిన్-సి సరిపోతుంది. ఈ ఆవకూరలో ఆవు పాలలో ఉన్న దాని కంటే కాల్షియం మనకు లభిస్తుంది. ఈ ఆకును యాంటీ క్యాన్సర్ ఆకు అని వైద్యులు చెబుతున్నారు. హెరిడేటరీగా క్యాన్సర్‌ వచ్చేవారు ఎక్కువశాతం ఉంటారు. కణాల్లో డీఎన్ఏ డ్యామేజ్ అవడంతో అవి క్యాన్సర్ కణాలుగా మారుతాయి. అలాంటప్పుడు ఈ ఆకును నిత్యం తీసుకుంటే మన డీఎన్‌ఏని రిపేర్ చేసి క్యాన్సర్ కణంగా మారకుండా సంరక్షిస్తుంది. అలాగే ఆవకూరలో గ్లూకోస్ సైనోలేట్‌ అనే కెమికల్ కాంపాండ్స్‌ అధిక మోతాదులో ఉంటాయి. ఎక్కువ శాతం ఉండటం వల్ల లంగ్ క్యాన్సర్ మొదటి దశలో ఉన్నప్పుడు కంప్లీట్‌గా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా దీన్ని సైంటిఫిక్‌గానూ నిరూపించారు కూడా.

కూర వండుకున్నా ఎంతో స్పెషల్‌గా ఉంటుంది

ప్రపంచ వ్యాప్తంగా మగవారిని ఇబ్బంది పెట్టే క్యాన్సర్ లంగ్ క్యాన్సర్. మహిళలకు అయితే బ్రెస్ట్ క్యాన్సర్. ఈ క్యాన్సర్లకు అద్భుత ఔషధంగా ఈ ఆవకూరను చెప్పవచ్చు. ఆ తర్వాత కోలన్‌ క్యాన్సర్ మొదటి దశలో ఉన్నవారికి ఈ ఆకును వాడటం వల్ల పూర్తిగా నయమవుతుంది. 2016లో మణిపాల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇదే విషయాన్ని రుజువు చేశారు. ఆవకూర కొంచెం పెప్పర్ రుచిని పోలి ఉంటుంది. అలాగే చేదుగా కూడా ఉంటుంది. అందుకే ఉప్పు లేకపోయినా ఏమీ తేడాగా అనిపించదు. పప్పులో వేసి వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కూర వండుకున్నా.. ఎంతో స్పెషల్‌గా ఉంటుంది. ఇంట్లోనే దీన్ని పెంచుకుని తింటే చక్కటి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

ఇది కూడా చదవండి: తొమ్మిది అవతారాల్లో ముస్తాబైన నిహారిక ఫొటో వైరల్

#helth-benefits #vitamins #nutrients #greens #mustard-greens #cancer
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి