Music Living Legend AR Rahman Birthday: ఏ ఆర్ రహమాన్...ఇతని మ్యూజిక్‌కు మైమరిచిపోని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ప్రపంచ సినీ సంగీతం మీద తనదైన ముద్ర వేసిన ఏఆర్ రహ్మాన్ బారతీయుడు అవడం గర్వంగా చెప్పుకోవాల్సి విషయం. ఇతని తరంలో ఉన్నవారందరూ అతను మా వాడే అని చెప్పుకుంటారు. భవిష్యత్తు తరం ఏ ఆర్ రహమాన్ ను మా తల్లిదండ్రులు చూశారు తెలుసా అని చెప్పుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు కూడా. 1992లో తన కెరీర్ ప్రారంభించిన రమమాన్ చాలా తొందరగానే కీర్తి శిఖరాలను అందుకున్నారు. మొదటి పాటతోనే తనేంటో నిరూపించుకున్నారు.
Also Read: భారత జీడీపీ పరుగులు తీస్తుంది అంటున్న ప్రభుత్వం
కీబోర్డు ప్లేయర్‌గా మెఒదలైన కెరియర్..
తెలుగు సంగీత దర్శకుడు కోటి (Koti) దగ్గర కీ బోర్డు ప్లేయర్‌గా చేరిన రహమాన్ ఇంత గొప్ప సంగీత దర్శకుడు అవుతాడని ఎవరూ ఊమించలేదు. ఏ ఆర్ రహమాన్‌కు లైఫ్‌ను ఇచ్చింది మాత్రం తమిళ దర్శకుడు మణిరత్నం. ఈయన సినిమాలతోనే రమమాన్ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగారు. 1992 రోజా సినిమా నుంచి 2018 బిగిల్ సినిమా వరకూ అన్ని భాషల్లో కలిపి ఇతను 70 సినిమాలకు సంగీతాన్ని అందించారు. భారతదేవానికి తొలి ఆస్కార్‌ను (Oscar Award) రుచి చూపించిన వ్యక్తి.అంతేకాదు ఒకే ఏడాది 2 ఆస్కార్ అవార్డులను పొందిన తొలి ఆసియా దేశస్థుడు కూడా. దీంతో పాటూ గ్రామి అకాడమి అవార్డ్ అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడు కూడా రహ్మానే.
అవార్డులన్నీ అతని సొంతం..
నాలుగేళ్ళ వయసులోనే తండ్రి దగ్గర పియానో నేర్చుకున్నారు రహ్మాన్. తరువాత 11 ఏళ్ళప్పుడు తండ్రి చనిపోగా...అప్పటి ను్చి మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు.రమేష్‌నాయుడు, ఇళయరాజా, కోటిల దగ్గర కీ బోర్డు ప్లేయర్‌గా పని చేశారు రహ్మాన్. మ్యూజిక్ డైరెక్టర్‌గా అతని మొదటి చిత్రం మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన రోజా. ఈ సినిమాతో పాటూ మెరుపుకలలు, లగాన్, అమృత సినిమాలకు రహ్మాన్ జాతీయ అవార్డులు అందుకున్నారు. నాలు జాతీయ చలన చిత్ర అవార్డులు, 15 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, 19 ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులు, రెండు ఆస్కార్, ఒక గ్రామీ ఇతని షొంతం అయ్యాయి. 2010లో కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో (Padma Bhushan Award) కూడా సత్కరించింది. టైమ్ మ్యాగజైన్ రెహమాన్ కు మొజార్ట్ ఆఫ్ మద్రాస్ బిరుదు ఇచ్చింది.
సంప్రదాయం టూ పాప్ వరకు..
సాంప్రదాయ సంగీతం నుంచి పాప్ వరకూ అన్ని రకాల సంగీతం ఇతని సొంతం. రహ్మాన్ చేతిలో ఎటువంటి సంగీతం అయినా ప్రాణం పోసుకోవాల్సిందే. అంతేకాదు ట్రెడిషనల్ మ్యూజిక్‌ను లేటెస్ట్ బీట్‌తో మిక్స్ చేసి శభాష్ అనిపించగలడు ఈ మ్యూఇజ్ మాజిక్ లివింగ్ లెజెండ్. ఇండియన్ మ్యూజిక్ ప్రపంచంలో సంచలనాలకు సెంటర్ పాయింట్. కీబోర్డ్, పియానో, సింథసైజర్, హార్మోనియమ్, గిటార్, ఫ్లూట్ ఇలా ఇతను వాయించలేని మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ లేదు. సింథసైజర్ అంటే అతనికి రహ్మాన్‌కు క్యూరియాసిటీ ఎక్కువట. అదొక మ్యూజిక్, టెక్నాలజీల కాంబినేషన్..నేటి ప్రపంచంలో ఇలాంటివే సంచనాలను సృష్టిస్తాయని అంటారు. రెహమాన్ ఒక ఐకాన్. మ్యూజిక్ కంపోజ్ చేయడమే కాదు… మంచి సింగర్, సాంగ్ రైటర్ కూడా. ఎన్నో సినిమాలకు పాటలు రాయడమే కాదు అద్భుతంగా పాడారు. ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా కంపోజ్ చేసాడు రెహమాన్. కర్నాటక సంగీతాన్ని, ఖవ్వాలీ స్టయిల్‌ను, రెగే, హిప్-హాప్, ర్యాప్, రాక్, పాప్, జాజ్, ఒపెరా, సూఫీ ఆఫ్రికన్, అరేబియన్, వెస్టర్న్ మ్యూజిక్‌లను పర్ఫెక్ట్ గా మిక్స్ చేయడంలో ప్రావీణ్యుడు. రెహమాన్ మంచి ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. దేశభక్తుడు కూడా. దీనికి మంచి ఉదాహరణే.. ఇతను కంపోజ్ చేసిన వందేమాతం గీతం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన మ్యూజిక్ గిఫ్ట్ ను అందించారు. తరువాత ఇదే ఆల్బమ్ ఆల్ టైమ్ లాంగెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్ గా రికార్డు సెట్ చేసింది.
డౌన్ టూ ఎర్త్...
డౌన్ టూ ఎర్త్‌కు పెరఫెక్ట్ ఉదాహరణ అయిన రహమాన్ తెలుగులో నిప్పురవ్వకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆ తర్వాత పల్నాటి పౌరుషం, సూపర్ పోలీస్, నాని, కొమరం పులి, ఏమాయ చేసావే వంటి పలు చిత్రాలకు సంగీతం అందించారు. 2009 లో ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులలో ఒకడిగా రహమాన్‌కు గుర్తింపు లభించింది. రెహమాన్ గౌరవార్ధం కెనడా లోని ఒంటారియో రాష్ట్రంలోని ఒక వీధికి అతని పేరు పెట్టారు. కష్టేఫలి అంటారు...దీనిని చేసి నిరూపించారు రహమాన్. టాలెంట్ అందరికీ ఉంటుంది..కానీ దానిని సరిగ్గా ఉపయోగించడంలోనే ఉంది అసలు కిటుకు అంతా. తమ టాలెంట్‌ను కరెక్ట్‌గా వాడుకున్న వారిలో రహమాన్ ఎప్పుడూ ముందుంటారు. ఒక మంచి, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాదు జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి అనే దానికి కూడా రహమాన్ ఆదర్శంగా నిలుస్తారనడంలో సందేహం లేదు.