హరి హర వీరమల్లు దర్శకుడు అందుబాటులో లేడా? కీరవాణి కామెంట్స్ వైరల్

సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న నా సామిరంగా ప్రమోషన్స్ లో బాగంగా  ఈ చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి హరిహరవీరమల్లు చిత్ర ప్రోగ్రస్ చెప్తూ..మూడు పాటలు చేసామని ,క్రిష్ అందుబాటులో లేడని చెప్పడంతో హరి హర వీరమల్లు ప్రాజెక్ట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.

హరి హర వీరమల్లు దర్శకుడు అందుబాటులో లేడా? కీరవాణి కామెంట్స్ వైరల్
New Update

PAWAN KALYAN MOVIES UPDATES : రెండు పడవల మీద ప్రయాణం చేయడం ఎంత రిస్కో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితి చూస్తుంటే అర్ధం అవుతోంది. ఓ వైపు రాజకీయాలు , మరో వైపు సినిమాలు చేస్తోన్న పవన్ ప్రస్తుతం ట్రాక్లో  ఉన్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా   తయారైంది. ఆయా దర్శకులు  మీడియా ముందుకొచ్చి చాలా రోజులే అయింది.ఈ క్రమంలో హరిహర వీరమల్లు సినిమా ప్రోగ్రస్ తెలియజేసిన కీరవాణి మాటలు వైరల్ అవుతున్నాయి.

హరి హర వీరమల్లు క్రిష్ డేట్స్ ఇస్తే చేస్తా - కీరవాణి

నా సామిరంగా చిత్రానికి సంగీతం అందిస్తున్న ఆస్కార్ విజేత కీరవాణి ఈ ప్రమోషన్స్ లో భాగంగా హరి హర వీరమల్లు దర్శకుడు క్రిష్ పై సంచలన వుయఖ్యలు చయడం ఇపుడు నేట్టింత వైరల్ మారింది. పవన్ కళ్యాణ్ –క్రిష్ కాంబినేషన్లో తెరకేక్కుతోన్న  హరి హర వీరమల్లు మూవీ ప్రోగ్రస్ ఏంటి అని అడగ్గా   ఆల్రెడీ మూడు పాటలు పూర్తి చేశామని, మిగిలిన పాటలను క్రిష్ డేట్స్ ఇస్తే చేస్తానని , క్రిష్ గారు, కళ్యాణ్ గారు అందుబాటులోకి వచ్చాక మిగిలిన వర్క్ ఉంటుందని కీరవాణి చెప్పడం జరిగింది. .అంటే .. క్రిష్ అందుబాటులో లేడని ఇన్ డైరెక్ట్గా  కీరవాణి చెప్పడంతో ప్రస్తుతం కీరవాణి మాటలు వైరల్ గా మారాయి.

అప్పట్లో క్లారిటీ ఇచ్చిన నిర్మాత

ఇంతకీ హరి హర వీరమల్లు ఉంటుందా లేదా అని అభిమానులు కంగారు పడుతున్నారు. ఈ విషయం పై ఆ మధ్య ఈ మూవీ నిర్మాత ఏ ఎం రత్నం హరి హర వీరమల్లు సినిమా ఖచ్చితంగా ఉంటుందని .. త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని చెప్పడం జరిగింది. ఈ విషయాన్నీ చెప్పి కూడా చలా రోజులే అయింది. ఇక.. డైరెక్టర్ క్రిష్ అంజలి – అవసరాల శ్రీనివాస ఆవు కాంబినేషన్లో మదుర వాణి వెబ్ సిరేష్ నిర్మాణం లో బిజీగా ఉన్నారు.

ALSO READ:Hanuman : హనుమాన్ షోస్ లో దేవర థియేటర్ గ్లింప్స్ ప్రదర్శన

క్రిష్, హరీష్ శంకర్, సుజిత్ నెక్స్ట్ స్టెప్

హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సైతం డిలే అవడంతో  ఈ లోగా హరీష్ శంకర్ వేరే మూవీ పట్టలేక్కించారు. సుజిత్ దర్సకత్వంలో తెరకేక్కబోతోన్న ఓజి పరిస్థితి కూడా అలాగే ఉంది. దేంతో పవన్ ఫ్యాన్సే గగ్గోలు పెడుతున్నారు. నిజానికి హరి హర వీరమల్లు చిత్రం తరువాత ట్రాక్ ఎక్కిన ప్రాజెక్ట్స్  వకేల్ షాబ్ , భీమ్లా నాయక, బ్రో సినిమాలు రిలిజయి చలా కాలమే అయినా క్రిష్, హరీష్ శంకర్ , సుజీత్ ఎందుకిలా స్తబ్దుగా ఉండిపోతున్నారనేది బిమనులకు అంతుచిక్కడంలేదు. ఈయన ఒజీ మూవీ పై సైతం రూమర్స్ వస్తున్నాయి. నిర్మాత దానయ్య క్లారిటి ఇస్తూ పోస్ట్ పెట్టడం జరిగింది. బాలయ్య బాబు సైతం పోలిటిక్స్ లో యాక్టివ్గా ఉంటూనే .. జెట్ స్పీడ్ తో సినిమాలను చేస్తున్నాడు కదా అంటూ అభిమానులు చర్చ మొదలెడుతున్నారు. మరి.. కీరవాణి అన్నట్లు క్రిష్ ఎందుకు టచ్ లో లేరు. హరి హర ఎప్పుడు పట్టలేక్కుతుంది అనే విషయాలపై మేకర్స్ క్లారిటీ ఇస్తే ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అవుతారు.కనీసం ఆయా చిత్ర దర్శకులయినా అప్పుడప్పుడు అబిమానులతో ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది కదా అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.,

#dvv-dhanayya #sujeeth #pawankalyan #naa-saami-ranga #krish #mm-keeravani #naa-saami-ranga-promotions
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి