/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/crime-jpg.webp)
Crime: అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మరో వివాహం కోసం కడతేర్చాడు ఓ దుర్మార్గుడు. పెళ్లై కనీసం సంవత్సరం కూడా కాకముందే చంపి పూడ్చిపెట్టాడు. సుమారు 8 నెలల తరువాత ఈ హత్య విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగి అసలు విషయాన్ని బయటపెట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రికి చెందిన గ్రానైట్ వ్యాపారి నరేంద్రరెడ్డి 13 నెలల క్రితం అనంతపురానికి చెందిన జయమ్మ అనే యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వివాహం గురించి నరేంద్ర రెడ్డి ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుండడంతో పాటు మరో పెళ్లి చేసుకోవాల్సిందే అని పెద్దలు ఒత్తిడి తీసుకుని వచ్చారు.
దీంతో నరేంద్ర రెడ్డి మరో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి గురించి జయమ్మకు తెలియడంతో నరేంద్ర రెడ్డిని నిలదీసింది. దీంతో జయమ్మ అడ్డును ఎలాగైనా తొలగించుకోవాలని నరేంద్ర రెడ్డి నిర్ణయించుకున్నాడు. దీంతో మరో ముగ్గురితో కలిసి జయమ్మను చంపి చేయ్యేరులో పూడ్చి పెట్టాడు.
అయితే గత కొంతకాలంగా జయమ్మ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం కలిగింది. దీంతో ఈ విషయం ఆ నోట..ఈ నోట పడి చివరికి పోలీసుల వరకు చేరింది.దీంతో వారు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ముందుగా నరేంద్ర రెడ్డి డ్రైవర్ ని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో 8 నెలల తరువాత చేయ్యేరులో తవ్వకాలు. 8 నెలలు కావడంతో జయమ్మ ఎముకలు లభ్యం అయ్యాయి. వాటిని పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు నరేంద్ర రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Also read: నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్