మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుపై.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్‌రావు.. రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని అన్నారు. అసెంబ్లీలో లాబీలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటికీ కూడా హరీష్‌రావుకు ప్రయోజనం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తీసుకుంటామని అన్నారు. ఇందుకు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలతో పార్టీలోకి రావాలని ఓ షరతు కూడా పెట్టారు. ఆయన వస్తే దేవదాయ శాఖ ఇస్తామని వ్యాఖ్యానించారు.
Also Read: గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే నోటిఫికేషన్..
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన పాపాలను కడుక్కోవడానికి ఈ మంత్రి పదవి ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే హరీశ్ రావు, కడియం శ్రీహరిలా తాము జీ హుజూర్ బ్యాచ్ కాదన్నారు. పదవుల కోసం పాకుడాలే వాళ్లం కాదని.. ప్రజలకు కోసం ఉండేవాళ్లమని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవులు వదులుకున్న చరిత్ర మాదని అన్నారు. బీఆర్‌ఎస్ చీఫ్ పాలిటిక్స్ మానుకోవాలంటూ ధ్వజమెత్తారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చీలిక తీసుకురావాలని చూస్తున్నారని.. గతంలో మాకు విపక్ష హోదా లేకుండా చేశారని అన్నారు. తెలంగాణను కేసీఆర్ నాశనం చేశారని.. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత తమపై పడిందని అన్నారు. బీఆర్‌ఎస్ నల్గొండ సభకు జనం వచ్చే అవకాశం లేదని.. ఈ సభ అట్టర్ ఫ్లాప్ అవుతుందని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు దమ్ముంటే పార్టీని నడపాలని.. హరీష్‌రావును మా పార్టీలోకి రమ్మంటున్నామని తెలిపారు.
Also Read: రాజ్యసభ సీటు కోసం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ.. పెద్దల సభకు వెళ్లేది వీరేనా?