IPL-2024 : మనం మనం ఎప్పటికైనా ఒక్కటే.. రోహిత్‌ను కౌగలించుకున్న హార్దిక్

ఎహే మీరు మీరు ఎవరేమనుకున్నా మాకేం పర్వాలేదు...మేమంతా చివరకు ఒక్కటే అని నిరూపించారు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలు. ప్రాక్టీస్ సెషన్‌లో ఇద్దరూ ఒకరితో ఒకరు ఆప్యాయంగా మాట్లాడుకుని..అభిమానుల మనసు గెలుచుకున్నారు.

IPL-2024 : మనం మనం ఎప్పటికైనా ఒక్కటే.. రోహిత్‌ను కౌగలించుకున్న హార్దిక్
New Update

Mumbai Indians Practice Session : రోహిత్ శర్మ(Rohit Sharma), హార్దిక్ పాండ్యా(Hardik Pandya)... ఈ మధ్య కాలంలో వీరిద్దరి గురించి వచ్చినన్ని వార్తలు ఇంకెవ్వరి గురించీ రాలేదు. ఐపిఎల్(IPL) ఆటగాళ్ళ వేలం నుంచి మొదలైంది వీరిద్దరి గురించి మాట్లాడుకోవడం. గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans) లో ఉన్న హార్ధిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్(Mumbai Indians) ట్రేడ్ చేసి మరీ కొనుక్కోవడం.. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి అతనికే పగ్గాలు ఇవ్వడంతో మొదలైంది గొడవ. ఈ విషయం మీద ఇద్దరు క్రికెటర్లూ ఎక్కడా ఓపెన్ స్టేట్‌మెంట్లు ఇవ్వనప్పటికీ...రోహిత్ శర్మ మాత్రం అసంతృప్తిగా ఉన్నాడని తెలిసింది. సోషల్ మీడియా(Social Media) లో కూడా రోహిత్ హార్దిక్‌ను అన్‌ఫాలో చేశాడని చెప్పారు.

హిట్మ్ మాన్ రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పించడం మీద చాలానే విమర్శలు వచ్చాయి. ఐదు సార్లు టైటిల్ అందించిన వాడిని తప్పించడమేంటి అని అందరూ గోల చేశారు. చాలా మంది మాజీ లు సైతం తీవ్రంగా విమర్శించారు. అయితే ఇప్పుడు వాటన్నింటికీ చెక్ పెట్టారు రోహిత్, హార్ధిక్‌లు. ఎవరేమనుకున్నా...మనం ఎప్పటికైనా ఒకటే అంటూ నిరూపించుకున్నారు.

ఐపీఎల్-2024(IPL-2024) సీజన్‌లో ముంబై ఇండియన్స్ తన మొదటి మ్యాచ్‌ను మార్చి 24న ఆడనుంది. దీని కోసం టీమ్ అంతా ముంబైకు చేరుకుంది. వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ప్రాక్టీస్ క్యాంపులో ముంబై జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో హార్ధిక్, రోహిత్ శర్మలు ఇద్దరూ అభిమానులు మనసులను దోచుకున్నారు. ఒకరికొకరు ఎదురు పడగానే కౌగలించుకుని...ఆప్యాయంగాఆ మాట్లాడుకున్నారు. రా అన్నా మనం మనం ఒకటే అన్నట్టు హార్దిక్, రోహిత్‌ను పట్టుకున్న విధానం చూడముచ్చటగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ షేర్ చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారింది.

Also Read : Hyderabad : రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో చిక్కిన కీలక నిందితులు

#mumbai-indians #rohit-sharma #cricket #hardhik-pandya #ipl-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe