Mumbai Indians : బుమ్రాకు జరిగింది ముమ్మాటికి అన్యాయమే.. ఇలా జరగాల్సింది కాదు భయ్యా!

2024 ఐపీఎల్ సీజన్‌కు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా ఎంపికయ్యాడు. జట్టులో విధేయుడిగా ఉన్న బుమ్రాను కాకుండా.. పాండ్యాను ఎంపిక చేయడంతో అంబానీ జట్టు అభిమానులు హర్ట్ అయ్యారు. బుమ్రాకు జరిగింది ముమ్మాటికి అన్యాయమేనని బాధపడుతున్నారు.

Mumbai Indians : బుమ్రాకు జరిగింది ముమ్మాటికి అన్యాయమే.. ఇలా జరగాల్సింది కాదు భయ్యా!
New Update

MI : జస్‌ప్రిత్‌ బుమ్రా(Jusprit Bumrah) మనసు బంగారం. అతనిలోని టాలెంట్‌ని వెలికితీసి.. ప్రపంచానికి చూపించిన ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) ఫ్రాంచైజీనికి ఇప్పటికీ విధేయుడిగానే ఉన్నాడు. బుమ్రా ఆక్షన్‌లోకి వెళ్లాలనుకుంటే అతనికి కోట్లు పలుకుతాయి. రికార్డు ధర పలుకుతుంది. అతని కోసం ఫ్రాంచైజీలు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడవు. అయినా కూడా బుమ్రా ఆ పని చేయలేదు.. చెయ్యలని అనుకోలేదు కూడా.. తనకు లైఫ్‌ ఇచ్చిన టీమ్‌కు రుణపడి ఉన్నాడు. అవకాశం ఉన్నా.. జట్టును వదలకుండా ఫ్రాంచైజీ పట్ల ఇంత విధేయంగా ఉన్న క్రికెటర్ మరొకరులేరు కూడా.. ఇవి ముంబై ఫ్యాన్స్ మనసులో మాటలు. కెప్టెన్‌గా హార్దిక్‌పాండ్యాను ఎంపిక చేసిన ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ పట్ల ఫ్యాన్స్‌ చాలా కోపంగా ఉన్నారు. రోహిత్‌ కాకపోతే సీనియరైన బుమ్రాకు ఛాన్స్ ఇవ్వాలి కానీ.. పాండ్యాకు ఎందుకిచ్చారని ప్రశ్నిస్తున్నారు.

publive-image

ఫ్యాన్స్‌లో అసంతృప్తి:
బుమ్రా(Bumrah), పాండ్యా.. ఇద్దరూ ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) నుంచే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. స్టార్‌ ఇమేజ్‌ వచ్చిన తర్వాత ఇద్దరిని ముంబై పలుసార్లు రిటైన్ చేసుకుంది. అయితే 2022 సీజన్‌కు ముందు హార్దిక్‌పాండ్యా ముంబైని వీడాడు. గుజరాత్‌ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ముంబైకి పరోక్షంగా చురకలంటించాడు. అయినా ముంబై మరోసారి అతడిని ట్రేడ్‌ చేసుకుంది. అంతేకాకుండా అతడికి తాజాగా కెప్టెన్సీ అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ముంబై ఫ్యాన్స్‌ అసంతృప్తిగా ఉన్నారని సోషల్‌మీడియాలో వారి పోస్టులు చూస్తూనే అర్థమవుతోంది.


గాయాలు కారణంగానే ఇవ్వలేదా?
మొదటి నుంచి ముంబైని అంటిబెట్టుకున్న బుమ్రాను కాదని.. పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంపై భిన్నరకాల వాదనలు వినిపిస్తున్నాయి. భవిష్యత్‌ ప్రణాళికల దృష్ట్యా పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించినట్టు ఫ్రాంచైజీ యాజమాన్యం చెప్పుకుంటోంది. రోహిత్‌ శర్మ ప్రస్తుత వయసు 36. దీంతో పాండ్యాను ట్రేడ్‌ చేసుకోని మరీ కెప్టెన్సీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక బుమ్రాకు కెప్టెన్సీ ఇచ్చి ఉంటే బాగుండేదన్నది ఫ్యాన్స్ మాట. అయితే బుమ్రాకు తరుచుగా గాయాలవుతుంటాయని.. అందుకే పాండ్యాకు ఇచ్చినట్టు కొంతమంది అభిప్రాయపడుతుంగా.. పాత ఎంప్లైయ్‌తో చాకిరి చేయించుకోని.. ప్రమోషన్‌ ఇవ్వకుండా.. గతంలో కంపెనీ వదలి వెళ్లిపోయిన వారిని తిరిగి తీసుకొని హెడ్‌ పొజిషన్‌ ఇచ్చినట్టు ఉందని బుమ్రా విషయంలో ఫ్యాన్స్‌ జాలి చూపిస్తున్నారు.

Also Read: రోహిత్‌ ఫ్యాన్స్‌కు అంబానీ అతి భారీ షాక్‌.. కెప్టెన్సీ తొలగింపు..!

WATCH:

#mumbai-indians #cricket #jasprit-bumrah #hardik-pandya #bumrah
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe