Viral Video : ముంబై జెర్సీ తగలబెట్టిన రోహిత్ అభిమాని.. ట్విట్టర్‌లో వెల్లువెత్తుతున్న నిరసనలు! ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్‌పాండ్యాను ఎంపిక చేయడం పట్ల రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. ఫ్రాంచైజీ నిర్ణయాన్ని ట్వీట్ల రూపంలో వ్యతిరేకిస్తున్నారు. ఇక బాగా హర్ట్ అయిన ఓ ఫ్యాన్ ముంబై జెర్సీని తగలబెట్టి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. By Trinath 16 Dec 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Rohit Fan : ఫ్యాన్స్‌కి లాజిక్స్‌తో పని ఉండదు.. ఎమోషన్స్ మాత్రమే కావాలి. తమకు ఏదైనా నచ్చితే దేవుడు, దైవం అంటూ గుళ్లు కడతారు.. నచ్చకపోతే ఇంటిపైకి రాళ్లూ, రప్పలు వేస్తారు. రోడ్లపైకి వచ్చి పోస్టర్లను తగలబెడతారు. సినిమా ఫ్యాన్స్‌కి మాత్రమే ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయని అనుకోవద్దు. క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఇలానే ఉంటారు. అయితే సినీ హీరోల ఫ్యాన్స్‌లా నిత్యం గొడవలు క్రియేట్ చేస్తూ ఉండరు.. తమ కోపం, ఆవేశం బ్లాస్ట్ ఐనప్పుడు హద్దులు మీరుతూ ఉంటారు. తాజాగా ముంబై ఇండియన్స్(Mumbai Indians) అభిమానులు అలానే లిమిట్ క్రాస్ చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ(Rohit Sharma)ను పక్కన పెట్టి హార్దిక్‌పాండ్యాను ఎంపిక చేయడం వారి ఆగ్రహానికి కారణం. నిజానికి ఇది ఊహించినదే అయినా కెప్టెన్సీ మార్పు ప్రాసెస్ స్మూత్‌గా జరగలేదన్నది విశ్లేషకుల మాట. An angry #RohitSharma fan burnt #MumbaiIndians jersey last night pic.twitter.com/4miy1DWe1P — Madhav Sharma (@HashTagCricket) December 16, 2023 జెర్సీ తగలబెట్టిన అభిమాని: పాండ్యా(Pandya) ను కెప్టెన్‌గా నియమిస్తూ అంబానీ జట్టు తీసుకున్న నిర్ణయాన్ని సగటు ముంబై ఇండియన్స్ అభిమాని అంగీకరించలేకపోతున్నాడు. ఐపీఎల్‌లో ముంబైను ఐదు సార్లు విజేతగా నిలిపిన ఘనత రోహిత్(Rohit)ది. అలాంటి రోహిత్‌ను భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా అని కెప్టెన్‌గా పక్కన పెట్టి పాండ్యాకు కెప్టెన్ చేశారు. అది కూడా గుజరాత్ నుంచి పాండ్యాను ట్రేడ్ చేసుకోని మరీ ఇలా చేశారు. ఇది రోహిత్ ఫ్యాన్స్‌కు ఏ మాత్రం నచ్చలేదు. ఇంకేముంది తమ ఆగ్రహాన్ని ట్వీట్ల రూపంలో ఓవైపు వ్యక్తం చేస్తూనే మరోవైపు తమకు తోచిన విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందులో ఓ అభిమాని ఏకంగా ముంబై జెర్సీని తగలబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి రోహిత్ ఎప్పటికైనా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సిందే. అతని వయసు 36. ముంబై ఫ్రాంచైజీతో అతనికి వీడదియ్యరాని అనుబంధం ఉంది. క్రికెట్ నుంచి వైదోలిగినా రోహిత్ ఫ్రాంచైజీతోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో సచిన్ నుంచి హర్భజన్‌కు ఇలానే కెప్టెన్సీ మార్పు జరిగింది. అలానే రోహిత్ నుంచి పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని అతడిని ట్రేడ్ చేసుకున్నప్పుడే అంతా భావించారు. అయితే ఈ మార్పు వచ్చే సీజన్‌కే ఉంటుందని ఫ్యాన్స్ ఊహంచలేదు. అందుకే ఇలా బ్లాస్ట్ అవుతున్నారని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. Also Read: ధోనీ వర్సెస్ రోహిత్ ఎపిక్ క్లాష్‌కి ఎండ్‌కార్డ్.. ఫ్యాన్స్ ఎమోషనల్! WATCH: #mumbai-indians #rohit-sharma #hardik-pandya #ipl-2024 #rohit-fan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి