IPL : ధోనీ వర్సెస్‌ రోహిత్‌ ఎపిక్‌ క్లాష్‌కి ఎండ్‌కార్డ్.. ఫ్యాన్స్‌ ఎమోషనల్‌!

ఐపీఎల్‌లో ముంబై తన కొత్త కెప్టెన్‌గా హార్దిక్‌పాండ్యాను నియమించిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే సీజన్‌(2024)లో రోహిత్‌ వర్సెస్‌ ధోనీ ఎపిక్‌ క్లాష్‌ను ఫ్యాన్స్‌ మిస్‌ అవనున్నారు. ఈ ఇద్దరూ కెప్టెన్లుగా 22సార్లు తలపడగా.. అందులో రోహిత్‌ 12 మ్యాచ్‌ల్లో గెలిచాడు.

IPL : ధోనీ వర్సెస్‌ రోహిత్‌ ఎపిక్‌ క్లాష్‌కి ఎండ్‌కార్డ్.. ఫ్యాన్స్‌ ఎమోషనల్‌!
New Update

Rohit v/s Dhoni : ఇద్దరికి ఇద్దరే.. కెప్టెన్సీలో ఎవరూ తక్కువ కాదు.. ఎత్తులకుపై ఎత్తులు వేస్తారు.. టైమ్‌ చూసి అస్త్రశస్త్ర బాణాలు వదులుతారు. గురి చూసి కొట్టారంటే టార్గెట్‌ ఫసక్‌ అవ్వాల్సిందే. ఇదంతా ఎవరి గురించో ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. ఐపీఎల్‌లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరైన రోహిత్‌(Rohit Sharma), ధోనీ(MS Dhoni) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్‌లో ముంబై వర్సెస్ చెన్నై జట్ల మ్యాచ్‌ను ఎల్‌క్లాసికో అంటారు. నువ్వానేనా అన్నట్లుగా ఈ రెండు జట్లు తలపడతాయి. ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే ఫ్యాన్స్‌ టీవీలకు అతుక్కుపోతారు. పోటీ కూడా చివరి వరకు ఉంటుంది. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్‌(IPL) (2024) నుంచి రోహిత్ వర్సెస్‌ ధోనీ క్లాష్ చూడలేకపోవచ్చు. ఎందుకంటే ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ మారాడు.

ఫ్రాంచైజీ నిర్ణయంతో బాధపడ్డ ముంబై ఫ్యాన్స్:
భవిష్యత్‌ ప్రణాళికల దృష్ట్యా ముంబై తన కెప్టెన్‌ను ఛేంజ్ చేసింది. రోహిత్‌కు బదులుగా గుజరాత్‌ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్‌పాండ్యాను కెప్టెన్‌ను చేసింది. దీంతో ఫ్యాన్స్‌ కాస్త హర్ట్ అయ్యారు. వచ్చే సీజన్‌కు రోహిత్‌నే కెప్టెన్‌గా వచ్చి తర్వాత పాండ్యాకు ఇచ్చి ఉంటే బాగుండేదని.. కెప్టెన్సీ మార్సు స్మూత్‌గా జరగలేదంటున్నారు. అదే సమయంలో రోహిత్‌ వర్సెస్‌ ధోనీ ఎపిక్‌ క్లాష్‌ని మిస్‌ అవుతామని ట్వీట్లు చేస్తున్నారు. నిజానికి ఈ రెండు జట్ల రైవలరి రోహిత్‌ వచ్చిన తర్వాతేం స్టార్ట్ కాలేదు. సచిన్‌ కెప్టెన్‌గా ఉన్నప్పుడే గాడ్‌ వర్సెస్‌ ధోనీ మొదలైంది. అయితే ఐపీఎల్‌-6 సీజన్‌ తర్వాత అది రోహిత్‌ వర్సెస్‌ ధోనీగా మారింది.

ఎవరిది పైచేయి:
రోహిత్‌ వర్సెస్‌ ధోనీ క్లాష్‌లో ఎవరిది పైచేయి..? నిజానికి ఈ రెండు జట్లకు చెరో ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలు ఉన్నాయి. అయితే రోహిత్‌, ధోనీ ఒకరినొకరు తలపడినప్పుడు మాత్రం హిట్‌మ్యాన్‌దే పైచేయి. ఈ ఇద్దరు సంబంధిత జట్లకు కెప్టెన్లగా ఉన్నప్పుడు 22 మ్యాచ్‌లు ఆడారు. అందులో 12 మ్యాచ్‌ల్లో రోహిత్‌ టీమ్‌నే గెలిచింది. మిగిలిన 10 మ్యాచ్‌ల్లో ధోనీ టీమ్‌ విక్టరి సాధించింది. ఇక ఐపీఎల్‌ ఫైనల్స్‌లో రోహిత్‌పై తలపడ్డ ప్రతీసారి ధోనీ ఓడిపోయాడు. ఇది చెన్నై ఫ్యాన్స్‌కు మింగుడుపడని విషయం. క్లాష్‌ ఎంతపెద్దదైనా, రైవలరి ఎంత భారీదైనా యట్‌ ది ఎండ్‌ ఆఫ్‌ ది డే గణాంకాలే మేటర్స్‌ కదా. అందుకే చెన్నై ఫ్యాన్స్‌ సైతం రోహిత్‌ కెప్టెన్సీని మెచ్చుకోకుండా ఉండలేరు. తాజాగా ముంబై నిర్ణయంతో రెండు జట్ల అభిమానులు కాస్త ఎమోషనల్‌ అయ్యారు. ఢీ అంటే ఢీ అనుకునే ఈ రెండు జట్లు తలపడడం మరోసారి చూడలేమని తలుచుకోని బాధ పడుతున్నారు.

Also Read:  బుమ్రాకు జరిగింది ముమ్మాటికి అన్యాయమే.. ఇలా జరగాల్సింది కాదు భయ్యా!

WATCH:

#rohit-sharma #cricket #ms-dhoni #ipl-2024 #ipl-auction-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe