Bangladesh: బంగ్లాదేశ్‌ ప్రధానిగా రేపు మహమ్మద్‌ యూనస్‌ ప్రమాణ స్వీకారం..

బంగ్లాదేశ్‌లో మహమ్మద్‌ యూనస్‌ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్ధీన్‌ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

New Update
Bangladesh: బంగ్లాదేశ్‌ ప్రధానిగా రేపు మహమ్మద్‌ యూనస్‌ ప్రమాణ స్వీకారం..

బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్‌ హసీనా భారత్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ నోబెల్ శాంతి బహుమతి గ్రహిత మహమ్మద్‌ యూనస్‌ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్ధీన్‌ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రేపు (గురువారం) ఉదయం 8 గంటలకు మహమ్మద్ యూనస్‌ బంగ్లాదేశ్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు

Also Read: మరోసారి తెరపైకి రాజపక్స కుటుంబం.. ఈసారి ఎన్నికల్లో పోటీ

మహమ్మద్ యూనస్ ఎవరు ?

మహమ్మద్ యూనస్ ఒక వ్యాపార వేత్త, ఆర్థికవేత్త, పౌర సామాజిక నేత. గతంలో గ్రామీణ్‌ బ్యాంక్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. గ్రామీణ్‌ బ్యాంక్‌ను స్థాపించి.. పేద ప్రజలకు సేవలందించినందుకు ఈయనకు 2006లో నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. అయితే విద్యార్థుల ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్న అనంతరం అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్ధీన్‌ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో.. మహమ్మద్‌ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యతను అప్పగించాలని నిర్ణయించారు.

Advertisment
తాజా కథనాలు