Mudragada: నాతో కలిసి రండి.. ఆ రోజే వైసీపీలోకి వెళ్తున్నా: ముద్రగడ!

కాపునేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు ఈ నెల 14న ముహుర్తం ఖరారు అయిన విషయం తెలిసిందే. 14 తారీఖున వైసీపీలో చేరేందుకు యావత్తు ప్రజానీకం కూడా తనతో కలిసి రావాలని.. మీ ఆశీస్సులు ఎప్పుడూ తన మీద ఉంచాలని ఆయన కోరారు.

Mudragada: నాతో కలిసి రండి.. ఆ రోజే వైసీపీలోకి వెళ్తున్నా: ముద్రగడ!
New Update

Mudragada to Join in YCP On March 14: కాపునేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham)  వైసీపీలో చేరేందుకు ఈ నెల 14న ముహుర్తం ఖరారు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కాపు నేతలకు, ఆయన అభిమానులకు, ప్రజలకు సోమవారం ఓ లేఖను విడుదల చేశారు. 14 తారీఖున వైసీపీలో చేరేందుకు యావత్తు ప్రజానీకం కూడా తనతో కలిసి రావాలని.. మీ ఆశీస్సులు ఎప్పుడూ తన మీద ఉంచాలని ఆయన కోరారు.

ఆయన రాసిన లేఖలో ఈ విధంగా ఉంది...''గౌరవ ప్రజానీకానికి మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారములండి. ఈ మద్య జరిగిన రాజకీయ పరిణామాలు మీ అందరికి మీడియా ద్వారా తెలుసు అని అనుకుంటున్నానండి.

గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహనరెడ్డి (CM Jagan) గారు పిలుపు మేరకు వై.యస్.ఆర్.సి.పి లోకి (YSRCP) వెళ్ళాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నానండి. మరలా వారిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి మీ సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానండి. వారి ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పధకాలతోపాటు, వీలైనంత అభివృద్ధిని వారితో చేయించాలని ఆశతో ఉన్నానండి. మీ బిడ్డను అయిన నేను ఎప్పుడూ తప్పు చేయలేదండి, చేయను కూడా.

తేది 14-03-2024న వై.యస్.ఆర్.సి.పి లోకి చేరుటకు ఉదయం 8-00 గంటలకు కిర్లంపూడి నుండి తాడేపల్లికి ప్రయాణం అవుతున్నానండి. మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు కూడా పాలుపంచుకోవడానికి రావాలని ప్రార్ధిస్తున్నానండి.

చిన్న మనవి, క్షమించండి ఈ ప్రయాణంలో మీ, మీ కావలసిన |ఆహారం, ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోమని కోరుకుంటున్నానండి.

రూటు మేప్

కిర్లంపూడి --> ప్రత్తిపాడు --> జగ్గంపేట లాలా చెరువు -- వేమగిరి --> రావులపాలెం -- తణుకు --> తాడేపల్లిగూడెం --> ఏలూరు --> విజయవాడ--- తాడేపల్లి.'' అంటూ ప్రజలనుద్దేశించి ఆయన లేఖను విడుదల చేశారు.

Mudragada

Also Read:  విశ్వంభర సెట్స్‌ లో త్రిషకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన మెగాస్టార్‌!

#jagan #mudragada-padmanabham #ycp #mudragada
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe