Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తలను కలవడానికి కూడా ఆయన ఇష్టపడటం లేదని చెప్పారు. మీకు మాకు సెట్ అవ్వదని క్లారిటీ ఇచ్చారు. టీడీపీ (TDP) లేదా జనసేనలోకి (Janasena) వెళ్తానని.. లేకపోతే ఇంట్లోనే కూర్చుంటానని అన్నారు. వైసీపీలోకి (YSRCP) వచ్చే ప్రసక్తే లేదంటూ కామెంట్స్ చేశారు. మా ఇంటికి వచ్చి మీరు సమయం వృథా చేసుకోవద్దని.. మీ పని మీరు చూసుకోండంటూ వైసీపీ నేతలకు క్లారిటీ ఇచ్చారు.
కాపు ఉద్యమనేతగా గుర్తింపు తెచ్చుకున్న ముద్రగడ పద్మనాభం ఇటీవలే తాను ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరతానంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే ముద్రగడ ఏ పార్టీలోకి వెళ్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ముద్రగడతో టీడీపీ, జనసేన నేతలు వరుసగా భేటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన జనసేన పార్టీలోకి చేరుతారంటూ రాష్ట్రంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే త్వరలోనే ముద్రగడ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను (Pawan Kalyan) కలవనున్నట్లు సమాచారం. మరోవైపు ముద్రగడ.. టీడీపీలోకి వెళ్లే అవకాశం కూడా ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తాజాగా ఆయన వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని.. టీడీపీ లేదా జనసేనలోకి వెళ్తానని క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరుతారన్నది ఆసక్తిగా మారింది.
Also Read: నరసాపురం బరిలో ప్రభాస్ పెద్దమ్మ.. ఏ పార్టీ నుంచో తెలుసా?