Farmers Protest: MSP చట్టం హడావుడిగా తీసుకురాలేం: కేంద్రమంత్రి కనీస మద్దతు ధరపై తక్షణమే చట్టం తీసుకురాలేమని కేంద్రమంత్రి అర్జున్ ముండా అన్నారు. కొన్ని శక్తులు రాజకీయ ప్రయోజనాల కోసమే రైతులను వాడుకుంటున్నాయని అన్నారు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే.. కనీస మద్దతు ధర చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. By B Aravind 13 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో.. ఢిల్లీ చలో పేరుతో రైతుల ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి వస్తున్న రైతులను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ అంశంపై కేంద్రమంత్రి అర్జున్ ముండా స్పందించారు. కనీస మద్దతు ధరపై తక్షణమే చట్టం తీసుకురాలేమని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై చర్చలు జరిపేందుకు రైతు సంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. Also Read: నన్ను చంపుతారా?.. సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు రాజకీయం కోసం రైతులను వాడుకుంటున్నారు విపక్ష పార్టీలను ఉద్దేశిస్తూ.. కొన్ని శక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే రైతుల ఆందోళనను వినియోగించుకుంటున్నాయని అన్నారు. వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. కనీస మద్దతు ధర చట్టాన్ని హడావుడిగా తీసుకురాలేమన్నారు. దీనిపై అన్ని వర్గాల వారితో సుధీర్ఘంగా చర్చలు జరపాల్సి ఉంటుందని తెలిపారు. అందుకే రైతు సంఘాలు ఆందోళనను విరమించాలని.. ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని సూచనలు చేశారు. ఎంఎస్పీపై కుదరని ఏకాభిప్రాయం అయితే ఈ ఆందోళనలపై కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, అర్జున్ ముండా నేతృత్వంలో ప్రభుత్వ బృందం.. రైతుల ప్రతినిధులుగా వచ్చిన రాజకీయేతర నేతలపై సోమవారం చర్చలు జరిపింది. రైతులు చేసిన డిమాండ్లలో మంత్రులు కొన్నింటికి అంగీకారం తెలిపారు. కానీ కనీస మద్దతు ధరపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో అన్నదాతలు మంగళవారం మరింత ఆందోళనలకు దిగారు. Also Read: పోర్న్ స్టార్ తో రణ్ వీర్.. శృంగారం ఇలా ఆస్వాదించాలంటూ వీడియో మేము చట్టం తీసుకొస్తాం ఇదిలాఉండగా. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీపై విమర్శలు చేసింది. రైతులు చేస్తున్న ఆందోళనను పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. MS స్వామినాథన్ కమిషన్ ప్రకారం ప్రతి రైతు పండించే పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చట్టం తీసుకురావాలని నిర్ణయించామని తెలిపింది. ఇది 15 కోట్ల రైతు కుటుంబాల జీవితాలను మారుస్తుందని పేర్కొంది. న్యాయం కోసం తాము చేస్తున్న వాటిలో ఇదే మా తొలి గ్యారెంటీ అని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. #telugu-news #congress #national-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి