Prabhas : డార్లింగ్‌ పక్కన హీరోయిన్ గా ఛాన్స్‌ కొట్టేసిన సీతారాం భామ!

మృణాల్ టాలీవుడ్‌ లో మరో పెద్ద బంపరాఫర్ కొట్టేసింది. అది కూడా పాన్‌ ఇండియా స్టార్‌... ప్రభాస్‌ పక్కన నటించేందుకు ఛాన్స్‌ కొట్టేసింది.హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్రభాస్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాలో మృణాల్‌ కథానాయికగా చేయబోతున్నట్లు సమాచారం

New Update
Mrunal Thakur: బల్కం పేట్ ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న సీతారామం బ్యూటీ

Prabhas : సీతారామం(Sita Ramam) సినిమాతో కుర్రాళ్ల మనుసులు దోచుకున్న మృణాల్‌ ఠాకూర్‌(Mrunal Thakur).. తన తరువాత సినిమాల విషయంలో ఆచితూచి ఇండస్ట్రీలో అడుగులు వేస్తుంది. సీతారామం మూవీ తరువాత నేచురల్‌ స్టార్‌ నాని(Natural Star Nani) పక్కన హీరోయిన్‌ గా హాయ్‌ నాన్న(Hi Nanna) సినిమాతో మరో హిట్‌ ని తన లిస్టులో వేసుకుంది.

తొలి సినిమాతోనే భారీ విజయానని సొంతం చేసుకుంది. త్వరలో విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) సరసన ఫ్యామిలీ స్టార్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా ఏప్రిల్ లో థియేటర్లలోకి వస్తుంది. ఇదిలా ఉంటే మృణాల్ టాలీవుడ్‌ లో మరో పెద్ద బంపరాఫర్ కొట్టేసింది. అది కూడా పాన్‌ ఇండియా స్టార్‌... ప్రభాస్‌ పక్కన నటించేందుకు ఛాన్స్‌ కొట్టేసింది.

ప్రభాస్‌ ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో కల్కి , మారుతీ డైరెక్షన్‌ రాజా సాబ్ అనే చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల మీద ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

ఎందుకంటే సలార్ తరువాత ప్రభాస్‌ నుంచి రాబోతున్న సినిమాలు. ఈ రెండు సినిమాల మీద అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. సలార్‌ అంతటి హిట్‌ ఈ సినిమాలు కూడా అందుకుంటాయాని ఆశిస్తున్నారు.

వీటి తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్రభాస్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాలో మృణాల్‌ కథానాయికగా చేయబోతున్నట్లు సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన రానుంది.

Also Read : అవును అది ఎడిట్‌ చేసిన ఫొటోనే.. తప్పు ఒప్పుకున్న రాజ కుటుంబం!

Advertisment
తాజా కథనాలు