Kate Middleton : అవును అది ఎడిట్ చేసిన ఫొటోనే.. తప్పు ఒప్పుకున్న రాజ కుటుంబం! బ్రిటన్ రాజకుటుంబం ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ చిత్రంఒరిజినల్ ఫొటో కాదు..ఎడిట్ చేసిన ఫొటో అంటూ పెద్ద ఎత్తున దుమారం రేగింది.దీంతో బ్రిటన్ రాజకుటుంబం ఆ ఫొటో ఎడిట్ చేసిందే అని అంగీకరించింది. దీని గురించి క్షమాపణలు కోరింది. By Bhavana 12 Mar 2024 in ఇంటర్నేషనల్ వైరల్ New Update షేర్ చేయండి Edited Photo : బ్రిటన్(Britain) రాజకుటుంబం ఆదివారం మాతృదినోత్సవం(Mother's Day) సందర్భంగా విడుదల చేసిన ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్(Princess Of Wales Kate Middleton) చిత్రం పై సోషల్ మీడియా(Social Media) పెద్ద రచ్చే జరిగింది. ఆ ఫొటో యువరాణి ఒరిజినల్ ఫొటో కాదు అని.. ఎడిట్ చేసిన ఫొటో అంటూ పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీంతో బ్రిటన్ రాజకుటుంబం దిగి వచ్చింది. వారు చేసిన తప్పును ఒప్పుకుంది. ఆ ఫొటో ఎడిట్(Edited Photo) చేసిందే అని అంగీకరించింది. దీని గురించి క్షమాపణలు కూడా కోరింది. అసలేం జరిగిందంటే.. బ్రిటన్ రాజకుటుంబం ఆదివారం బ్రిటన్ మాతృదినోత్సవం నాడు కేట్ మిడిల్టన్ పిల్లలతో కలిసి ఉన్న ఓ ఫొటోను ఎడిట్ చేసి విడుదల చేసింది. ఆ ఫొటోలో యువరాణి తన ముగ్గురు పిల్లలతో కలిసి నవ్వుతున్నట్లు ఉంది. కానీ ఆ చిత్రంలో కేట్ కుమార్తె ఎడమ చేయి సరైన అలైన్ మెంట్ లో లేకపోవడం వల్ల దానిని చూసిన వారికి అనుమానం వచ్చింది. అంతేకాకుండా యువరాణి చేతికి నిశ్చితార్ధపు ఉంగరం కూడా లేదు. దీంతో బ్రిటన్ పౌరులు ఒక్కసారిగా విమర్శలు చేయడం ప్రారంభించారు. అసలు యువరాణికి ఏమైంది అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. దీంతో జరిగిన తప్పును గుర్తించిన రాజ కుటుంబం క్షమించమని కోరింది. యువరాణి కేట్ గతేడాది జనవరి నుంచి కనిపించడం లేదు. దీంతో ఆమెకు కడుపులో శస్త్రచికిత్స జరిగిందని రాజ కుటుంబం తెలిపింది. ఆ తరువాత ఇప్పటి వరకు ఆమె ఎక్కడా కూడా కనిపించలేదు. దీంతో యువరాణి కేట్ కు సీరియస్ గా ఉందని కొందరు, ఇంకేదో అయ్యిందని మరి కొందరు రుమార్స్ పుట్టించడం మొదలు పెట్టారు. ప్రజలు ఎంత ఎత్తున యువరాణి గురించి అడుగుతున్నప్పటికీ రాజ కుటుంబం మాత్రం దాని గురించి కనీసం నోరు కూడా విప్పలేదు. అసలు యువరాణి గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఆమె ఉన్న ఫొటోను ఎడిట్ చేసి విడుదల చేయడంతో ఆమె ఆరోగ్యం గురించి దేశ వ్యాప్తంగా మరోసారి చర్చ జరుగుతుంది. ఇంత జరిగినప్పటికీ కూడా యువరాణి మాత్రం బయటకు రాలేదు. దీంతో ఆమె కు ఏదో జరిగిందనే చర్చ జరుగుతుంది. యువరాణికి సర్జరీ జరిగిన తరువాత ఆమె కోమాలోకి వెళ్లిపోయి ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది. నిజానికి శస్త్రచికిత్స జరిగితే మూడు నాలుగు రోజుల్లోనే తిరిగి కోలుకోవచ్చని కొందరు అభిప్రాయ పడుతున్నారు. కానీ ఇలా ప్రపంచానికి కనిపించకుండా ఎందుకు ఉంటున్నారు అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. అసలు యువరాణి కేట్ కు ఏం జరిగిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. Also Read : యూరిక్ యాసిడ్ ని తగ్గించడంలో యాలకుల పాత్ర ఎలాంటిందంటే! #britain #apology #edited-photo #social-media #kate-middleton మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి