MRO Ramanaiah Killed in Visakhapatnam: విశాఖపట్నం కొమ్మాదిలో ఎమ్మార్వో రమణయ్య అన్యాయంగా చనిపోయారు. గుర్తు తెలియని మనుషులు చరణ్ క్యాసిల్‌లో ఉంటున్న రమణయ్య ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. ఐరన్ రాడ్లతో విచక్షణా రహితంగా కొట్టారు. వాచ్ మెన్ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయారు. తరువాత రమణయ్యను ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మరణించారు.
ల్యాండ్ మాఫియా వల్లనేనా?
అయితే ఇదంతా ల్యాండ్ మాఫియా (Land Mafia) వాళ్ళ పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. కక్షగట్టే ఈ పని చేశారని అంటున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీపీ రవిశంకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య జరగడానికి కొంత సమయం ముందే ఇద్దరు వ్యక్తులు వ్చి రమణయ్యను కలిసి వెళ్ళారని వాచ్ మెన్ చెబుతున్నారు. దాంతో పాటూ ఇద్దరు పంచె కట్టుకున్న వ్యక్తుల కదలికలను పోలీసులు సీసీ కెమెరాల్లో గుర్తించారు. అలాగే హత్య చేయడానికి వచ్చిన వ్యక్తి మాస్క్ పెట్టుకుని ఉన్నాడని పోలీసులు గుర్తించారు. పంచె కట్టుకున్న ఇరిద్దరు వ్యక్తులే రమణయ్యను హత్య చేయించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
సీసీ టీవీ కెమెరాలు, వాచ్‌మ్యాన్ సాక్ష్యం ఆధారంగా పోలీసులునలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ మణికంఠ ఆధ్వర్యంలో అనుమానితులను విచారణ చేస్తున్నారు.సీసీ కెమెరాల ఆధారంగానే దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అయితే ఇంకా ఇనుప రాడ్‌తో కొట్టిన వ్యక్తి మాత్రం దొరకలేదు. అతని గురించి పోలీసులు జల్లెడ పడుతున్నారు. మొత్తం 12 టీమ్స్‌ని వెతకడానికి ఏర్పాటు చేసారు విశాఖ సీపీ రవి శంకర్.
Also Read:Lucknow Crime:వచ్చారు..కాల్చారు..పోయారు..సీసీ టీవీలో రికార్డు అయిన దారుణం!
రెండు రోజుల క్రితమే బదిలీ..
ఎమ్మార్వో రమణయ్య పదేళ్ళుగా ఉద్యోగం చేస్తున్నారు. డిప్యూటీ తహసిల్దార్, తహసిల్దార్, కలెక్టరేట్లో ఏవో గా విధులు నిర్వహించారు. వజ్రపు కొత్తూరు, పద్మనాభం, విశాఖ రూరల్ చినగదిలి మండలాల్లో ఎమ్మార్వో గా పని చేసిన రమణయ్యకు... ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల క్రితం విజయనగరం నగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయింది.