అదానీ సంస్థ రూ.13 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడింది.. మొయిత్రా సంచలన ఆరోపణలు..

అదాని సంస్థ రూ.13 వేల కోట్ల కుంభకోణానానికి పాల్పడిందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ఈ కుంభకోణం గురించి ప్రశ్నించేవారి గొంతు నొక్కేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఇలాంటి సంఘటన వేరే దేశాల్లో జరిగితే అక్కడి ప్రభుత్వాలు కూలిపోతాయన్నారు.

New Update
Mahua Moitra : మహువా ఇంటికి వెళ్లిన అధికారులు.. చివరికి

పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే వివాదంలో ఇరుకున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ సంస్థపై వచ్చిన బొగ్గు కుంభకోణం ఆరోపణలపై ప్రశ్నించిన వారి గొంతు నొక్కేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఆరోపించారు. అందుకే తనను లోక్‌సభ నుంచి వెలివేయాలంటూ నైతిక విలువల స్టాండింగ్ కమిటి సిఫార్సు చేసిందని అన్నారు. మొయిత్రా ఓ వార్తా సంస్థకు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారు. 'అదానీ సంస్థ రూ.13 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడింది. ఇలాంటి సంఘటనలు వేరే దేశాల్లో జరిగితే అక్కడి ప్రభుత్వం కుప్పకూలుతుంది. ఈ విషయం ప్రధాని మోదీకి తెలుసు. అందుకే ఈ వ్యవహారాన్ని ఎక్కువ కాలం పాటు దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ, అదానీలే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఎవరైనా వారి గురించి ప్రశ్నిస్తే, బయటకు లాగితే భయాందోళనలకు గురవుతారు. అందుకే ప్రశ్నించేవారి గొంతు నొక్కేయాలని, అలాంటి వారిని జైల్లో పెట్టాలన్నదే వాళ్ల ఆలోచన. బీజేపీ పార్టీ ఓ అబద్ధాల కర్మాగారం. ప్రతిరోజు వారు అసత్య వార్తలను ప్రచారంలోకి తెస్తారు.

దేశంలోని మొత్తం మీడియా సంస్థల్ని కూడా మోదీ, అదానీలే నియంత్రిస్తుడటం అసలు సమస్య. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు నేను డబ్బులు, గిఫ్ట్స్ తీసుకున్నాననే ఆరోపణలపై ఎథిక్స్‌ కమిటీ నివేదికలో ఎటువంటి ఆధారాలు కూడా లేవు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్న నిబంధనలన్ని బీజేపీ తుంగలో తొక్కుతోంది. నాపై బీజేపీ అనుసరిస్తున్న వైఖరి నాకు మేలే చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఏం జరుగుతోందనేది దేశ ప్రజలు గమనిస్తున్నారు. లోక్‌సభ నైతిక విలువల కమిటీ సభ్యులు నా విషయంలో తమ పార్టీ విధానాలననుసరించి ఓటేయలేదు. నాపై వచ్చిన ఆరోపణలపై మా పార్టీకి నాకు అండగానే ఉంది. నేను సైతం నా హక్కు కోసం పోరాడాను. 2024 సాధారణ ఎన్నికల్లో మరింత మెజారిటీతో గెలిచి లోక్‌సభలో అడుగుపెడతానని అని మొయిత్రా అన్నారు.

Also Read: ఐదేళ్లలో నక్సలిజాన్ని ఖతం చేస్తాం.. అమిత్ షా

మరోవైపు లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు మహువా మొయిత్రా నగదు తీసుకున్నారనే ఆరోపణలపై విచారణ జరిపిన లోక్‌సభ నైతిక విలువల కమిటీ నివేదిక లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయానికి వెళ్లింది. కమిటీ ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌ సోన్కర్‌ శుక్రవారం దాన్ని అందచేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇక మహువాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు