MP Harsha Kumar: జగన్ సర్కార్ పై (CM Jagan) మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపిలో (AP) దళితులు (SC, ST's) రెండో స్థాయి పౌరులుగా ఉన్నారని పేర్కొన్నారు. దళితులు పథకాలను ఎన్నో వైసీపీ ప్రభుత్వం (YCP Government) ఎత్తివేసిందని మండిపడ్డారు. అమ్మ ఒడి (Amma Vodi) కి తూట్లు పొడిచిన ఘనత జగన్ దే అని ఫైర్ అయ్యారు. నవ రత్నాలకు (Nava Ratnalu) బడ్జెట్ నుంచి కేటాయించాలని... కానీ అమ్మ ఒడి లబ్ధిదారులకు సబ్ ప్లాన్ నుంచి నిధులు కేటాయించడం ఏమిటి? అని సీఎం జగన్ ను ప్రశ్నించారు.
ALSO READ: అందుకే విశాఖనే ఏపీకి రాజధాని.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
విద్యకు దళితులు దూరం..
నవ రత్నాలకు బడ్జెట్ నుంచి కేటాయించాలని... కానీ అమ్మ ఒడి లబ్ధిదారులకు సబ్ ప్లాన్ నుంచి నిధులు కేటాయించడం ఏమిటి? అని సీఎం జగన్ ను ప్రశ్నించారు. ఇది దళితుల పట్ల వివక్షత కాదా?...విద్య నుంచి దళితులను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. దళితులను అన్ని విధాలుగా మోసం చేస్తున్నారని.. జగన్ ఒక మోసగాడని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారని.. జగనన్న విదేశీ విద్యా పథకం లో ఒక్కరినైన విదేశాలకు పంపారా? అని సీఎం జగన్ ను ప్రశ్నించారు.
కోడి కత్తి శ్రీను జైల్లో నే మగ్గుతున్నారు...
మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ మరణానికి కారణం మీరు కదా?.. ఎంతో మంది దళితులకు శిరోముండనం చేయలేదా? అని సీఎం జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. దళిత యువకుడు కోడి కత్తి శ్రీను జైల్లో నే మగ్గుతున్నారని అన్నారు. దళిత జాతి సిఎం జగన్ ను 420 గా భావిస్తుందని పేర్కొన్నారు. దళిత జాతి మేల్కొవాలి...ఈ నెల 11 న రాజమండ్రి లో దళిత సింహ గర్జన నిర్వహిస్తున్నట్లు అని తెలిపారు.
వారిదే పెద్దతానం..
జగన్, సజ్జల, విజయ సాయి రెడ్డి, పెద్ధి రెడ్డి పెత్తందారులని అన్నారు. ఒక్క మంత్రి అయినా తమ శాఖ పై స్వతంత్రంగా సమీక్ష చేయగలరా? అని ఎద్దేవా చేశారు. మంత్రులు, వారి శాఖలు చెప్పిన వారికి లక్ష బహుమానం ఇస్తానని ప్రకటించారు. విజయవాడ లో 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహానికి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో కట్టారని పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. తెలంగాణ అంబెడ్కర్ విగ్రహం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టారని అన్నారు.
షర్మిల ఎఫెక్ట్ ఉంటుంది..
షర్మిల ఎఫెక్ట్ ను మునుముందు చూడబోతున్నాం అని అన్నారు. వైసిపి నుంచి దళితులను దూరం చేయడం భాధ్యత తీసుకుంటాను అని పేర్కొన్నారు. జగన్, అవినీతి, పెత్తందారీ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీ లోనే ఉన్నానని పేర్కొన్నారు. ఆ పార్టీ తరుపున పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.
ALSO READ: ఢిల్లీకి చంద్రబాబు.. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు?
DO WATCH: