MP Bharat: మానవత్వం చాటుకున్న ఎంపీ ఎంపీ మార్గాని భరత్ మానవత్వం చాటుకున్నాడు. భరత్ రాజమండ్రికి వెళ్తున్న సమయంలో అతని కన్వాయ్ రాజమండ్రి గ్యామన్ ఇండియా బ్రిడ్జి మీదకు రాగానే అక్కడ రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్‌ను ఢీ కొట్టడంతో బైక్‌పై వెళ్తున్న ముగ్గురికి తీవ్రగాయాలు కాగా. అందులో ఒకరు మృతి చెందారు. By Karthik 01 Oct 2023 in తూర్పు గోదావరి రాజకీయాలు New Update షేర్ చేయండి ఎంపీ మార్గాని భరత్ మానవత్వం చాటుకున్నాడు. భరత్ రాజమండ్రికి వెళ్తున్న సమయంలో అతని కన్వాయ్ రాజమండ్రి గ్యామన్ ఇండియా బ్రిడ్జి మీదకు రాగానే అక్కడ రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్‌ను ఢీ కొట్టడంతో బైక్‌పై వెళ్తున్న ముగ్గురికి తీవ్రగాయాలు కాగా. అందులో ఒకరు మృతి చెందారు. రోడ్డు ప్రమాదాన్ని గమనించిన ఎంపీ.. తన కాన్వాయ్‌లో ఉన్న ఎమర్జెన్సీ కిట్ ద్వారా వారికి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం 108కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న వైద్య సిబ్బంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమణ అతని భార్య, కుమారుడితో కలిసి కోనసీమ జిల్లా మండపేట మండల పరిధిలోని అత్తమూరు నుంచి బైక్‌పై గౌరీపట్నం వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు వెళ్తున్న బైక్‌ను లారీ బలంగా ఢీకొనడంతో రమణ భార్య వీరలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. మరోవైపు రమణ కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చికిత్స చేయించేందుకు రమణ వద్ద ఒక్క రూపాయి లేకపోవడంతో ఎంపీ క్షతగాత్రుడికి సహాయం చేసినట్లు భరత్ వర్గీయులు తెలిపారు. మరోవైపు పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజమండ్రి పోలీసులు సూచించారు. బైక్‌లపై ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే ప్రయాణం చేయాలని, లారీలను, బస్సులను ఓవర్ టేక్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. మూల మడతల వద్ద అతివేగం ఉండవద్దని, మూల మడతల వద్ద అతీవేగం ఉంటే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. ALSO READ: రాజమండ్రి స్వచ్చత.. ప్రతీ ఒక్కరి బాధ్యత #road-accident #rajahmundry #hospital #ambulance #108-ambulance #mp-bharat #evacuation #humanity మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి