Bandi Sanjay: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై (KCR) విమర్శల దాడికి దిగారు బీజేపీ (BJP) నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. గత పది ఏళ్లుగా అధికారంలో ఉండి కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) తెలంగాణ సంపదను దోచుకున్నారని మండిపడ్డారు. కరీంనగర్ (Karimnagar) రైల్వే స్టేషన్ ఆధునీకరణ, తీగలగుట్టపల్లి ఆర్వోబీ పనులను పరిశీలించిన బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ALSO READ: 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. పీఎం కిసాన్ ఎకరాకు రూ.12,000..?
కరీంనగర్ రైల్వే స్టేషన్ పనులు చకచక..
రైల్వే ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని బండి సంజయ్ కు అధికారులు తెలిపారు. మార్చి నెలాఖరులోపు ఆధునీకరణ పనులను పూర్తయ్యే అవకాశముందని వెల్లడించారు. తీగలగుట్టపల్లి ఆర్వోబీ పనుల తీరుతెన్నులపై అధికారులను ఆరా తీశారు బండి సంజయ్. భూసేకరణలో ఇబ్బంది ఎదురవుతోందని వెల్లడించిన ఆర్ అండ్ బి అధికారులు. అర్ అండ్ బి ఈఈ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్ ఇన్నాళ్లు భూసేకరణ అంశంపై ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
ప్రజలను ఇబ్బంది పెట్టకండి..
భూసేకరణ సాకుతో పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆర్వోబీ పనుల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దన్నారు. ఆర్వోబీ పనులు జరుగుతున్న చోట రోడ్లు కొట్టుకుపోయి దుమ్ము, ధూళితో జనం ఇబ్బందులు పడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డుకు తాత్కాలిక మరమ్మతు చేయాలని ఆదేశం ఇచ్చారు.
కేసీఆర్ శరీరంలో మద్యమే ఉంది...
కేసీఆర్ తెలంగాణ కోసం రక్తం చిందించారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒంట్లో ఉన్నదంతా మద్యమే తప్ప రక్తం ఎక్కడిదని ఎద్దేవా చేశారు. ప్రజల రక్తాన్ని పీల్చుకున్న తిన్న రాబందు రక్తం చిందించెప్పుడు? అని అన్నారు. రాష్ట్రం కోసం రక్తం చిందించింది బీజేపీ కార్యకర్తలే అని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడిన బీజేపీ కార్యకర్తలను కొట్టించిన సంగతి మర్చిపోయారా? అని కేటీఆర్ ను ప్రశ్నించారు.
కేటీఆర్ ను బొక్కలో వేసేవాళ్లం..
ప్రజలను దోచుకుతిన్న విషయాన్ని మర్చిపోయి కేటీఆర్ మాట్లాడుతున్నడు అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబం దోచుకోని పని ఏదైనా ఉందా? అని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేటీఆర్ ను బొక్కలో వేసేవాళ్లం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం చేసిన అరాచకాలు, అవినీతి, అక్రమాలను ఇంకా ఎందుకు ఉపేక్షిస్తుందో అర్ధం కావడం లేదని అన్నారు.
ALSO READ: ఆ విషయంలో విఫలమయ్యాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!