This Week OTT Releases: గత వారం ఈగల్, నా సామిరంగ, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలతో పాటు పలు చిత్రాలు ఓటీటీలో సందడి చేశాయి. ఇక ఈ వారం కూడా ఓటీటీ ప్రియులను అలరించడానికి అదిరిపోయే సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము..
పూర్తిగా చదవండి..హనుమాన్ (HanuMan)
యంగ్ హీరో తేజసజ్జ (Teja Sajja), ప్రశాంత్ వర్మ (Prashant Varma) దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ హనుమాన్. బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా.. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. విడుదలైన రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. మార్చి 8 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
లాల్ సలామ్
సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ లో కనిపించిన చిత్రం ‘లాల్ సలామ్’. ఫిబ్రవరి 9న రిలీజైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. థియేటర్ లో విడుదలైన నెల లోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. మార్చి 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
Also Read: హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో రామ్ – భీమ్.. ఇద్దర్నీ ఒకే చోట చూసి ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా..?
యాత్ర 2 (Yatra 2)
ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత.. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి సీఎం పదివిని ఎలా పొందాడు అనే నేపథ్యంలో తెరకెక్కిన సినిమా యాత్ర 2. 2019 లో వచ్చిన యాత్రకు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పొలిటికల్ డ్రామా మార్చి 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రానుంది.
బ్యాచిలర్ పార్టీ
అభిజిత్ మహేష్ డైరెక్ట్ చేసిన కన్నడ మూవీ బ్యాచిలర్ పార్టీ. ప్రముఖ కోలీవుడ్ నటుడు రక్షిత్ శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరిలో 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో మార్చి 4 నుంచి ‘బ్యాచిలర్ పార్టీ’ స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీలోకి రాబోతున్న మరిన్ని చిత్రాలు
- అన్వేషిప్పిన్ కండెతుమ్ ( మిస్టరీ థ్రిల్లర్)
మార్చి 8నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది
- లవర్ (తమిళ్ ఫిల్మ్ )
మార్చి 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో
- మేరీ క్రిస్మస్ ( హిందీ ఫిల్మ్)
మార్చి 8 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్
Manchu Manoj: “నీ హృదయంలో నాకు, ధైరవ్ కు చోటిచ్చినందుకు థ్యాంక్స్”.. భూమా మౌనిక ఎమోషనల్ పోస్ట్
[vuukle]