OTT Releases this Week: ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తుండడంతో ఓటీటీల హవా కూడా ఎక్కువగా ఉంది. వివిధ ఓటీటీ సంస్థలు పోటాపోటీగా ప్రతి వీకెండ్‌కు విభిన్న జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల చేస్తూ ప్రేక్షకులు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనున్న సినిమాలు వెబ్ సిరీస్‌లు ఏంటో చూద్దాం.
నెట్ ఫ్లిక్స్(Netflix):
గన్స్ అండ్ గులాబ్స్ (హిందీ సిరీస్)
దుల్కర్ సల్మాన్, రాజ్‌కుమార్‌రావ్, ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న గన్ అండ్ గులాబ్స్ వెబ్‌సిరీస్ ఆగస్ట్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌కు ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ డీకే డైరెక్షన్ చేస్తోన్నారు. 1980-90 బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది.
మాస్క్ గర్ల్ (కొరియన్ సిరీస్)
అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video):
హర్లాన్ కొబెన్స్ షెల్టర్ (వెబ్‌సిరీస్)
ఏపీ థిల్లాన్ ఫస్ట్ ఆఫ్ ఏ కైండ్
అమల (మలయాళం మూవీ)
జియో(Jio):
తాళి(హిందీ)
సుస్మితాసేన్ ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటిస్తున్న హిందీ వెబ్‌సిరీస్ తాళి జియో సినిమా ఓటీటీ లో ఆగస్ట్ 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ గౌరి సావంత్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సిరీస్‌కు రవి జాదవ్ దర్శకత్వం వహించాడు.
లయన్స్ గేట్ ప్లే
మైండ్ కేజ్
ఈటీవీ విన్(ETV Win)..
అన్నపూర్ణ ఫొటో స్టూడియో
చైతన్యరావ్, లావణ్య హీరోహీరోయిన్లుగా నటించిన తెలుగు మూవీ అన్నపూర్ణ ఫొటో స్టూడియో ఆగస్ట్ 15 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. లవ్ స్టోరీకి మర్డర్ మిస్టరీ ఎలిమెంట్స్‌ను జోడించి రూపొందిన ఈ సినిమాకు చెందు ముద్దు దర్శకత్వం వహించాడు.
జీ5 (ZEE5)..
ఛత్రపతి (హిందీ)
బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన బాలీవుడ్ మూవీ ఛత్రపతి ఆగస్ట్ 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ఛత్రపతి మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ హిందీ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహించాడు.
హాట్ స్టార్ (Hotstar)..
మతగం
సోనిలివ్(Sony LIV)..
ఆయిర్‌తన్ను నూనకల్ (మలయాళం)
ఇక తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'బేబి' మూవీ వచ్చే వారం శుక్రవారం(ఆగస్టు 25) నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ ఆహాలో కానుంది. ఈ మేరకు ఆహా సంస్థ ట్వీట్ చేసింది. సాయి రాజేశ్ దర్శకత్వంలో చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ ఏకంగా రూ.90 కోట్లకుపైగానే కలెక్షన్లను రాబట్టింది. జూలై 14న థియేటర్లలో రిలీజ్ అయిన 'బేబి' సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ట్రయాంగిల్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కింది.