Movies:అయోధ్య రామునికి హను-మాన్ విరాళం..ఎంతో తెలుసా.. హనుమాన్ సినిమా యూనిట్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది. ప్రిరిలీజ్ ఈవెంట్‌లో వచ్చిన ప్రతీ టికెట్ మీద ఐదు రూపాయలు పక్కకు తీసి అయోధ్య రామునికి ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఆ మాటను పాటిస్తూ ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లలో నుంచి 2,66,41,055 రూ.లను అయోధ్యకు పంపిస్తున్నారు. By Manogna alamuru 21 Jan 2024 in Latest News In Telugu New Update షేర్ చేయండి హనుమాన్...సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ అంచనాలకు మించి సూపర్ హిట్ అయింది. విడుదల అయి వారం రోజులు దాటినా...ఇంకా కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికీ థియేటర్లు ఫుల్ అయిపోతున్నాయి. అయితే హనుమాన్ విడుదలకు ముందే మూవీ యూనిట్ ఒక ప్రామిస్ చేసింది. టికెట్ మీద ఐదు రూపాయలు తీసి పక్కన పెట్టి అయోధ్య రాముడికి విరాళం ఇస్తామని తెలిపింది. ప్రరిలీజ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. ఇప్పడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది. ఇప్పటివరకు వచ్చిన మొత్తం కలెక్షన్‌లో ప్రతీ టికెట్ మీద 5రూ. చొప్పున అయోధ్య రామునికి విరాళంగా పంపిస్తున్నారు. విరాళంగా ఎంత అంటే... హనుమాన్ సినిమా అనుకున్నదాని కంటే ఎక్కువ కలెక్షన్లను రాబట్టుకుంది. దీంతో శ్రీరామునికి ఇచ్చిన విరాళం కూడా భారీగానే జమ అయింది. ఇప్పటివరకు 53,28,211 టికెట్లు అమ్మడవగా...వాటి నుంచి 5రూ. తీస్తే వచ్చిన మొత్తం 2,66,41,055 రూ. అయింది. ఈమొత్తాన్ని హనుమాన్ ఫర్ శ్రీరామ్ అనే పేరు మీద అయోధ్యకు పంపిస్తున్నారు. ఈ వివరాలన్నింటినీ, మీడియాకు, సోషల్ మీడియాలోనూ వెల్లడించారు. హనుమాన్ నిర్మాత అయిన నిరంజన్ రెడ్డిని సినీ ప్రియులు, నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. గొప్ప పని చేస్తున్నారంటూ మెచ్చుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజా జ్జ హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ సీనిమాలోని గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్‌ను తెగ పొగుతున్నారు. ఇందులో తేజా పక్కన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించగా వరలక్ష్మీ శరత్ కుమార్ అక్కగా, వినయ్ రాయ్ విలన్గా వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. మామూలు పల్లెటూరి అబ్బాయికి, సూపర్ హీరో, హనుమంతుడు కథను జోడించి అద్భుతమైన సినిమాగా తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. #tickets #movie #hanu-man #funds మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి