Breakfast: ఉదయాన్నే టీతో పాటు పరోటా తింటున్నారా?..జాగ్రత్త పరోటా, బెల్లంతో పాటు టీ తాగడం వల్ల ఆనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. మైదా పిండితో చేసిన పరోటా తింటే త్వరగా జీర్ణం కాక కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వస్తుంది. టీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి శరీరమంతా బద్ధకంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 05 Feb 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Breakfast: చాలా మందికి ఉదయాన్నే టీ తాగకపోతే ఏమీ తోచదు. కానీ కొందరు టీతో పాటు బ్రేక్ఫాస్ట్లా పరోటాలు తింటుంటారు. ఉదయం ఖాళీ కడుపుతో తినే ఆహారం రోజంతా శరీరానికి శక్తిని అందిస్తుంది. పరోటా, బెల్లంతో పాటు టీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. టీతోపాటు పరోటాలు తింటే ఏం అవుతుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. టీ, పరోటా తింటే: చాలా మందికి పరోటా అంటే ఇష్టం. తరచుగా అల్పాహారంలా తీసుకుంటుంటారు. అలాగే పరోటా తిన్న తర్వాత టీ తాగుతుంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అజీర్ణం, కడుపు సమస్యలు: సాధారణంగా పరోటా మైదా పిండితో చేస్తారు. ఇది మన శరీరంలో అంత త్వరగా జీర్ణం కాదు. దీనివల్ల కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వస్తుంది. అలాగే పరోటా వండడానికి నూనె ఎక్కువగా అవసరం పడుతుంది. ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా టీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. దీని కారణంగా శరీరమంతా బద్ధకంగా ఉంటుంది. బరువు పెరుగుతారు: పరోటా ఒక భారీ ఆహారం. ఇందులో అనేక రకాల కొవ్వు పదార్థాలు, కేలరీలు ఉంటాయి. దీనికి తోడు పంచదార, టీ తాగడం వల్ల కూడా మన శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతాయి. దీని వల్ల ఊబకాయం వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండె సమస్య: పరోటా, టీ కలిపి తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవడంతో పాటు గుండెల్లో మంట ఏర్పడుతుంది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉదయం పూట పరాటా తింటే అంత పెద్ద ఆరోగ్య సమస్యలు ఉండవని నిపుణులు అంటున్నారు. ప్రత్యామ్నాయం ఏమిటి?: ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలతో గోధుమ పిండి చపాతీ తినాలని వైద్యులు అంటున్నారు. ఇది కూడా చదవండి: చెవులను శుభ్రం చేయడానికి ఇయర్ బడ్స్ వాడుతున్నారా?..జాగ్రత్త గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #breakfast #health-benefits #parotta #tea సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి