Health:వ్యాయామం ఎప్పుడు చేస్తే మంచిదో తెలుసా..

అందరూ ఎక్సర్సైజ్ చేస్తారు. చాలా కష్టపడతారు. కానీ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అన్నది మాత్రం తెలుసుకోరు. కానీ ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య వ్యాయామం చేస్తే త్వరగా బరువు తగ్గుతారని మీకు తెలుసా.

Health:వ్యాయామం ఎప్పుడు చేస్తే మంచిదో తెలుసా..
New Update

వ్యాయామం చేయాలంటే మనం ముందు దాని గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా బురువు తగ్గాలనుకునేవారు. తొందరగా బరువు తగ్గాలంటే ఎప్పుడు వ్యాయామం చేస్తే మంచిదో తెలుసా. దీని మీద తాజాగా ఒబేసిటీ జర్నల్ ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య వ్యాయామం చేస్తే ఎఫెక్టివ్‌గా బరువు తగ్గుతారని తేల్చి చెప్పింది. ఈ అధ్యయనంలో 2003-2006 మధ్యకాలంలో నేషనల్ హెల్త్ & న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే (NHANES)లో పాల్గొన్న 5285 మందిని.. ఈ అధ్యయనం కోసం క్రాస్-ఎనలైజ్ చేశారు. పరిశోధకులు వారిని మూడు సమూహాలుగా విభజించారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మోడరేట్-టు-వైగరస్ ఫిజికల్ యాక్టివిటీ (MVPA) స్థాయి, స్థూలకాయంతో కూడిన రోజువారీ నమూనా రిలేషన్‌ను పరిశీలించారు.

Also Read:ఒక పోస్ట్..లక్షలు, కోట్లలో ఆదాయం-సోషల్ మీడియా మహారాణులు

ఉదయం పూట వ్యాయామం చేసేవారిలో ఇతర గ్రూప్‌లవారి కంటే ఎక్కువ బరువు తగ్గినట్టు గుర్తించారు. నడుము చుట్టుకొలత తక్కువ ఉన్నట్లు గుర్తించారు. ఉదయం వ్యాయామం చేసేవారు ఆరోగ్యకరమైన డైట్‌ను కూడా ఫాలో అవుతున్నారని, శరీర బరువు యూనిట్‌కు తక్కువ రోజువారీ శక్తిని తీసుకుంటారని చెబుతున్నారు.

ఉదయం పూట గ్రూప్‌లలో వారికి.. ఇతర గ్రూప్‌లతో పోలిస్తే శారీరక శ్రమలో తక్కువగా పాల్గొన్నట్లు అధ్యయనంలో తేలింది. శారీరక శ్రమ తక్కువగా ఉన్నప్పటికీ.. వారి శరీర ద్రవ్యరాశి సూచిక, నడుము చుట్టుకొలత తగ్గిందని పేర్కొన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం మునుపటి అధ్యయనం శారీరక శ్రమ తీవ్రత, ఫ్రీక్వెన్సీ, వ్యవధి అనే మూడు అంశాలపై దృష్టి పెట్టింది. ఎలా చూసినా కూడా ఉదయం 7 నుంచి 9 లోపు వ్యాయామాు చేసే వారు తొందరగా బరువు తగ్గుతున్నారని తేలింది.

#health #exercise #tips #morning
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe