Layoffs : ఐటీ రంగంలో ఆగని లేఆఫ్‌లు.. ఈ ఏడాది 98 వేల జాబ్స్ కట్ ఐటీరంగంలో ఉద్యోగులకు గడ్డుకాలం నడుస్తోంది. ఎప్పుడు జాబ్ పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 2024లో ఇప్పటివరకు మొత్తం 337 కంపెనీల నుంచి 98,834 మంది టెకీలు తమ ఉద్యోగాలు కోల్పోయారు. By B Aravind 22 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Silent Layoffs : ఐటీరంగం (IT Industry) లో ఉద్యోగులకు గడ్డుకాలం నడుస్తోంది. ఎప్పుడు జాబ్ పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 2022లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా లాంటి దిగ్గజ కంపెనీలు వేలాది మందిని ఉద్యోగంలో నుంచి తొలగించాయి. 2023లో ఈ తీవ్రత మరింత పెరిగింది. 2022తో పోలిస్తే 2023లో 59 శాతానికి లేఆఫ్‌లు పెరిగాయి. మొత్తం 262,915 ఉద్యోగాలు పోయాయి. కరోనా (Corona) మహమ్మారి సమయంలో ఎక్కువమంది ఉద్యోగుల్ని కంపెనీలోకి తీసుకోవడం, ఆర్థిక సంక్షోభం (Financial Crisis) రావడం లాంటి వల్లే ప్రస్తుతం ఐటీ రంగంలో లేఆఫ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. Also Read: జమ్మూ కాశ్మీర్‌తోపాటు మరో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు గత కొన్ని నెలలుగా పలు కంపెనీలల్లో లేఆఫ్‌లు జరుగుతున్నప్పటికీ.. 2024లో కూడా అలాగే కొనసాగుతూనే ఉంది. ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఇంకా తగ్గని సూచనలు కనిపిస్తున్నాయి. ఒక డేటా ప్రకారం.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం 337 కంపెనీల నుంచి 98,834 మంది టెకీలు తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పటికీ కంపెనీలు.. తమ ఖర్చు తగ్గించుకోవడం పైనే దృష్టి పెడుతుండటంతో మరింత ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఐటీ ఉద్యోగుల్లో ఎప్పుడు జాబ్ పోతుందోనని ఆందోళన చెందుతున్నారు. 2023లో జరిగిన లేఆఫ్‌ల వల్ల దాదాపు 20 వేల మంది టెక్నికల్ ప్రోఫెషనల్స్‌పై ప్రభావం పడిందని ఆల్ ఇండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయిస్ యూనియన్ (AIITEU) వెల్లడించింది. ఇలా ఉద్యోగాలు కోల్పోయిన ప్రొఫెషనల్ టెకీల సంఖ్య వాస్తవానికి ఇంకా ఎక్కువగానే ఉంటుందని అనుమానిస్తున్నారు. మరో నివేదిక ప్రకారం.. 2024లో మొదటి ఐదునెలల్లోనే కొన్ని బడా ఐటీ కంపెనీల నుంచి 2 వేల నుంచి 3 వేల మందిని సైలెంట్‌గా లైఆఫ్ చేసినట్లు తెలిపింది. ఉద్యోగాలు పోయినవారి రిలీవింగ్ లెటర్‌లో 'టర్మినేటెడ్' అని ఉంటే వారికి ఇంకో ఉద్యోగం వెతుక్కోవడం చాలా కష్టమవుతుంది. మరోవైపు కొన్ని కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించుకునేందుకు వారితో ఎక్కువ పనులు చేయించుకోవడం, పనికిరాని పనులు అప్పగించడం, తక్కువ పనీతీరు రివ్యూ ఇవ్వడం లాంటివి చేసి.. ఆ ఉద్యోగులే రాజీనామా చేసే పరిస్థితులను తీసుకొస్తున్నాయి. Also Read: ఇప్పటికైనా వారిపై ఉక్కుపాదం మోపండి.. కల్తీ మద్యం ఘటనపై నటుడు సూర్య! #telugu-news #it-jobs #it-layoffs #financial-crisis మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి