/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-7.jpg)
Heavy Rain Alert: వరుణుడు మరోసారి తన ప్రతాపాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నాడు. నేటి నుంచి మరో 4 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేడు రాష్ట్రంలోని జయశంకర్, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రం పై రుతుపవనాలు ఉద్ధృతంగా కదులుతున్నాయి.
ఉత్తరాంధ్ర వద్ద బంగాళాఖాతం తీర ప్రాంతం పై 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో గురువారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ ప్రకటించింది.
మరో వైపు రుతుపవన గాలుల ద్రోణి 1500 మీటర్ల ఎత్తున రాజస్థాన్ లోని జైసల్మేర్ నుంచి మధ్య ప్రదేశ్, రామగుండం, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకూ వ్యాపించి ఉంది.వీటి ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
గత నాలుగు రోజులుగా కుంభవృష్టి కురిసిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనేమళ్లీ నాలుగు రోజుల పాటు భారీగా వర్షం కురిసే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
Also Read: ఫ్లిప్ కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్.. లక్ష ఉద్యోగాలు