Jobs In Flipkart: పండగల సీజన్లో ధమాకా సేల్స్‌తో పాటూ ఉద్యోగాలనూ పట్టుకొచ్చేస్తోంది ఫ్లిప్ కార్ట్. పండగల సీజన్ వేళ నిర్వహించే బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా లక్ష ఉద్యోగాల సృష్టించబోతున్నట్లు ఫ్లిప్ కార్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. బిగ్ బిలియన్ డేస్ కోసం కొత్తగా 9 నగరాల్లో కొత్తగా 11 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు కూడా ప్రారంభించామని.. దీంతో వీటి సంఖ్య 83కు చేరిందని తెలిపింది. దేశ సామాజిక ఆర్థిక వృద్ధికి చేయూతలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి కల్పిస్తున్నామని చెప్పింది. ఇందులో భాగంగా సప్లయ్ చైన్ విభాగంలో 1 లక్ష ఉద్యోగాలు క్రియేట్ చేయనున్నామని తెలిపింది. పండల సీజన్లో వచ్చే బిగ్ బిలియన్ డేస్ నిర్వహణకు చాలా మంది ఉద్యోగులు కావాల్సి వస్తారు. ఇలాంటి టైమ్‌లో కొత్త ఉద్యోగులను నియమించుకోవడం వలన ఫ్లిప్‌కార్ట్ నిర్వహణ కార్యకలాపాలు మెరుగుపడడంతో పాటు స్థానిక కమ్యూనిటీకి ఉపాధి లభిస్తాయని ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం తెలిపింది.
పూర్తిగా చదవండి..FlipKart: ఫ్లిప్ కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్.. లక్ష ఉద్యోగాలు
ఇండియాలోని పెద్ద ఈ కామర్స్ లలో ఒకటైన ఫ్లిప్ కార్ట్‌లో భారీగా ఉద్యోగాలు ప్రకటించనున్నారు. పండగల సీజన్లో ప్రకటించే బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్బంగా లక్ష ఉద్యోగాలు సృష్టించనున్నామని అనౌన్స్ చేసింది ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం.
Translate this News: