విశాఖ ఎన్ఏడీ జంక్షన్లో హవాలా మనీ సంచలనం రేపింది. వాషింగ్ మెషీన్లో నోట్ల కట్టలు బయటపడడం అక్కడ అందరినీ అవాక్కయ్యేలా చేసింది. విశాఖ నుంచి విజయవాడకు వ్యాన్లో వాషింగ్ మెషీన్, అందులో నోట్ల కట్టలను తరలిస్తున్నారు. వీరిని ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు పట్టుకున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులతో వెళుతున్న ఓ ఆటోను ఆపి తనిఖీ చేయగా వాషింగ్ మెషిన్లను డెలివరీకి ఇచ్చేందుకు వెళుతున్నట్లు ఆటో డ్రైవర్ చెప్పాడు. అయితే, మెషిన్ లో మాత్రం గుట్టల కొద్దీ నోట్లకట్టలు బయటపడ్డాయి. వాటి విలువ రూ.1.30 కోట్లు అని పోలీసులు తెలిపారు. అందులోనే 30 మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయని పోలీసులు చెప్పారు. విశాఖపట్నంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఈ ఆటో పట్టుబడింది.
Also Read:ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం..లాక్ డౌన్ విధించే ఛాన్స్
అయితే నోట్ల కట్టలు ఎవరివనే విషయం కానీ, నగదుకు సంబంధించిన ఇతరత్రా ఆధారాలు కానీ దొరకలేదు. దీంతో నగదుతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆటోను సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మిగతా వివరాలను పోలీసులు వెల్లడించలేదు. నగరంలోని ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ నుంచి ఈ నోట్ల కట్టలను తరలిస్తున్నట్లు సమాచారం. దబ్బు ఎవరిది అయి ఉంటుందా అని ఎంక్వైరీ చేస్తున్నారు.
Also raed:నేటి నుంచే నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర