Visakhapatnam money seize:వాషింగ్ మెషీన్లో నోట్ల కట్టలు..భారీగా తరలి వెళుతున్న డబ్బు
ఆంధ్రాలోని విశాఖపట్నంలో రూ.1.30 కోట్లు హవాలా డబ్బును ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాషింగ్ మిషన్ లో భారీ కరెన్సీ నోట్ల కట్టలను విజయవాడకు వ్యాన్ లో తరలిస్తుండగా పట్టుకున్నారు. దీంతో పాటూ 30 సెల్ఫోన్లు, వాహనం స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో సీఆర్పీసీ 41,102 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.